ఈరోజు రాఖీ. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. దేశమంతా రాఖీ సంబరాల్లో మునిగి తేలుతోంది. కృష్ణ కుమార్తె మంజుల కూడా `రాఖీ` ముచ్చట్లు పంచుకుంది. అన్నయ్య రమేష్ బాబు, తమ్ముడు మహేష్ బాబులపై తనకున్న ప్రేమని చాటుకుంది. ”అన్నయ్య తన సంపాదనంతా మాకు గిఫ్టులు ఇవ్వడానికే కేటాయించేవాడు. ఓసారి అమెరికా నుంచి పదకొండు సూట్‌కేసులు తీసుకొచ్చాడు. వాటి నిండా బహుమతులే. ఆ సంగతుల్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంటాం. ఇక మహేష్ అయితే… చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. ఆ తరవాత.. మెచ్యూరిటీ వచ్చేసింది. సడన్‌గా అన్నయ్యలా ప్రవర్తించడం మొదలెట్టాడు. తన దగ్గర ఉంటే చాలా సెక్యూర్డ్‌గా ఉంటుంది. ఓసారి నన్ను, మా పాపనీ, మా ఆయన్నీ సడన్‌గా మాల్దీవులకు తీసుకెళ్లిపోయాడు. ఆ సంగతి ముందు రోజు వరకూ దాచి పెట్టాడు. ఇలాంటి చిన్న చిన్న సర్ప్రైజ్లు చాలా బాగుంటాయి…” అని చెప్పుకొచ్చింది మంజుల.