సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి మరో నట వారసురాలు వెండితెరపైకి వస్తుంది. కృష్ణ వారసుడిగా వచ్చిన మహేష్ బాబు సూపర్ స్టార్ గా వున్నారు. కృష్ణ తనయ, మహేష్ సోదరి మంజుల కూడా వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తర్వాత అసుదీర్ బాబు, నరేష్ తనయుడు నవీన్ వెండితెరపైకి వచ్చారు. ఇప్పుడు నాలుగో తరం కూడా సిద్దమైయింది. ఇప్పటికే మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ వెండితెర ఎంట్రీ ఇచ్చాడు.
ఇప్పుడు మంజుల కూతురు జాన్వి కూడా సిల్వర్ స్క్రీన్ పై మెరవనుంది. మంజుల దర్శకురాలిగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఆమె తెరకెక్కిస్తున్న తొలి చిత్రంలో సందీప్ హీరో. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలోని ఓ పాత్రలో మంజుల కుమార్తె జాన్వి కూడా నటిస్తుంది.
ఈ విషయాన్ని స్వయంగా మంజుల వెల్లడించింది. ‘ జాన్వి షూటింగ్ తొలిరోజున నేను చాలా భయపడ్డా. కానీ ఆమె మాత్రం చాలా ఈజీగా కాన్ఫిడెంట్ గా నటించింది. అందగత్తె. జాన్వి చిన్నప్పుడు మహేశ్‌బాబును గుర్తు చేసింది. అచ్చు మహేష్ లానే అనిపించింది’అంటూ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది మంజుల. మొత్తంమ్మీద మావయ్యతో పోలిక పెట్టి జాన్వి ఎంట్రీపై అప్పుడే అంచనాలు పెంచేసింది మంజుల.