పత్రికలో వచ్చే రాతలు కొన్నిసార్లు వాస్తవాన్ని మిస్ లీడ్ చేస్తాయి. ఓ చోట వచ్చిన వార్తే ప్రామాణికంగా మారిపోయే పరిస్థితి కూడా వుంటుంది. హీరోయిన్ అన్షు ది కూడా ఇలాంటి పరిస్థితే. మన్మధుడు సినిమాతో అందరి మనసులు కొల్లగొట్టిన అన్షు తర్వాత ప్రభాస్ రాఘవేంద్రలో కనిపించి ఆ తర్వాత మాయమైపోయింది. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత మళ్ళీ సందీప్ కిషన్ ‘మజాకా’ సినిమాతో ఇప్పుడు తెరపైకి వచ్చింది.
అయితే ఈ ఇరవై ఏళ్లలో ఆమె పేరు అన్షు అంబానీగా చాలామణీ లో వుంది. నిజానికి ఆమె ఇంటి పేరు అంబానీ కాదు. మరి ఆ పేరు ఎందుకు వచ్చి చేరిందో ఆమెకి కూడా తెలీదు. ఈ విషయాన్ని స్వయంగా అన్షు చెప్పింది. ఈ దేశంలో అంబానీ పేరు చాలా పాపులర్. అయితే నా ఇంటిపేరు అది కాదు. ఎవరో రిపోర్టర్ ఒకసారి అన్షు అంబానీ అని రాశారు. తర్వాత అందరూ అదే కంటిన్యూ చేశారు. చివరికి నా వికీపిడియాలో కూడా అదే పేరు వుంది. అక్కడ ఎలా మార్చాలో కూడా తెలీదు. నా పేరు అన్షు. నాకు ఇంటి పేరు వుంది కానీ. ఆ పేరు ఎక్కడ ఎప్పుడు వాడలేదు. నేను సచిన్ సాగర్ ని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు అన్షు సాగర్. అంతే కానీ అంబానీ పేరుతో నాకు ఎలాంటి రిలేషన్ లేదు. అది ఓ మిస్టేక్’ అని చెప్పుకొచ్చింది అన్షు.
మన్మధుడు సినిమా అన్షుకి మంచి బ్రేక్ ఇచ్చింది. తర్వాత ప్రభాస్ తో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమె లండన్ వెళ్లి అక్కడే సెటిల్ అయ్యింది. ఇప్పుడు తనకి ఇద్దరు పిల్లలు. మన్మధుడు రీరిలీజ్ కి వచ్చిన రెస్పాన్స్ తనని మళ్ళీ నటన వైపు నడిపేలా చేసిందని, ఇకపై మంచి క్యారెక్టర్స్ వస్తే చేస్తానని అంటోంది అన్షు.