తమిళంలో శింబు కథానాయకుడిగా నటించిన చిత్రం మన్నాడు. ఎస్.జె.సూర్య ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకుడు. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారని, రైట్స్ గీతా ఆర్ట్స్ చేతిలో ఉన్నాయని ప్రచారం జరిగింది. అల్లు శిరీష్ కోసం ఈ సినిమా రైట్స్కొన్నారని అనుకున్నారు. అయితే.. నిజానికి ఈ సినిమా రైట్స్ సురేష్ ప్రొడక్షన్స్ చేతిలో ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ తెలుగులో రీమేక్ చేయబోతోంది. అయితే… మన్నాడు నికాపీ కొట్టి, తెలుగులో ఓ సినిమా రూపొందిస్తున్నారన్న విషయం సురేష్ ప్రొడక్షన్స్‌కి తెలిసింది. అందుకే మన్నాడు రీమేక్ రైట్స్ గురించి ఓ లీగల్ నోటీస్ ఇచ్చింది. ఈసినిమా రైట్స్ తమ దగ్గర ఉన్నాయని, ఈ సినిమాలోని ఏ పార్ట్ అయినా కాపీ కొట్టినట్టు తెలిస్తే, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. గీతా ఆర్ట్స్ లో `మన్నాడు`ని పోలిన ఓ సినిమా స్క్రిప్టు రెడీ అవుతోంది. దానికీ మన్నాడుకి ఏమైనా సంబంధం ఉందా? లేదా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. `మన్నాడు`ని తెలుగులో `లూప్` పేరుతో డబ్ చేశారు. ఏపీ, తెలంగాణలలో ఈ సినిమా విడుదల చేస్తున్నప్పుడు కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యాయి. దాంతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు చేరలేదు. అయితే డబ్బింగ్ వెర్షన్ మాత్రం కొన్ని పైరసీ సైట్స్ లలో ఉన్నాయి. అయినప్పటికీ రీమేక్చేయాలని చూడడం సాహసమే.