మంచు మనోజ్ ఓ ఆల్ రౌండర్ అన్న సంగతి తెలిసిందే. నటించడంతో పాటు, డాన్సలు కంపోజ్ చేస్తాడు. పాటలు పాడతాడు.. రాస్తాడు. దానికి తోడు యాక్షన్ సీన్స్‌కి డైరక్షన్ కూడా చేస్తుంటాడు. ఇప్పుడు కూడా యాక్షన్ కొరియోగ్రాఫర్ గా అవతారం ఎత్తాడు. తన సినిమా కోసం కాదు. అక్క మంచు లక్ష్మీ ప్రసన్న సినిమా కోసం. మంచు లక్ష్మి ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం లక్ష్మీబాంబ్. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ ఫైట్‌ని కంపోజ్ చేస్తోంది ఎవరో కాదు.. మంచు మనోజ్.
ఈ సందర్భంగా లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ ”చాలెంజింగ్ పాత్ర చేస్తున్నాను. సినిమా చాలా బాగా వచ్చింది. ఇప్పటి వరకు చేయని డిఫరెంట్ క్యారెక్టర్ ఇది. ఫైట్స్, సాంగ్స్ బాగా వచ్చాయి.ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్‌ను తమ్ముడు మనోజ్ ఆధ్వర్యంలో చేశాం. చాలా బాగా వచ్చింది” అని చెప్పుకొచ్చింది. దీపావళికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.