లక్ష్య సేన్.. భారత్ లో స్పోర్ట్స్ పై ఆసక్తి ఉన్న వారికి కూడా వారం రోజుల ముందు పెద్దగా తెలియని పేరు. కానీ ఇప్పుడు ఈ ఆటగాడు సూపర్ స్టార్. ఒలింపిక్స్ లో అలవోకగా స్టార్ ప్లేయర్లను ఓడిస్తూ సెమీస్‌కు చేరాడు. మరో రెండు మ్యాచ్‌లు గెలిస్తే భారత్ గోల్డ్ కలను నెరవేర్చినవాడవుతాడు. ఆ ఆశలు భారతీయులందరికీ కలగడానికి ఆయన ఆటతీరే కారణం.
మూడు చేతులతో ఆడుతున్నట్లుగా ఉందని లక్ష్యసేన్ ఆటతీరును చూసిన వారు అబ్బురపడుతున్నారు. ఇప్పటి వరకూ ాయన గట్టి పోటీనే ఎదుర్కోలేదు. చాలా సులువుగా సెమీస్ చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్ రౌండ్లో చైనీస్ తైపీకి చెందిన 12వ సీడ్ చౌ టియన్ చెన్ను వరుస సెట్లలో ఓడించారు. ఆగస్టు 4న జరిగే సెమీ ఫైనల్ జరుగుతుంది. ఈ పారిస్ ఒలింపిక్స్‌లో స్టార్ ప్లేయర్లు పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ నిరాశపరిచారు. ప్రిక్వార్టర్స్‌లో సింధు, క్వార్టర్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ నిష్క్రమించారు.
Also Read : ఒలింపిక్స్ : కాంస్యంతో భారత్ బోణీ
ఇక గురితప్పకుండా పతకాలు సాధిస్తున్న షూటర్ మనుబాకర్ హ్యాట్రిక్ మెడల్‌పై గురిపెట్టింది. 25మీ. పిస్టల్ క్వాలిఫికేషన్లో 590 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగే ఫైనల్లో తను ఇదే ప్రదర్శన కనబరిస్తే స్వర్ణమో, రజతమో ఖాయం. ఈ పతకం సాధిస్తే.. మనుబాకర్ పేరు మార్మోగిపోతుంది.