ఒలింపిక్స్‌లో పతకం కోసం రోజుల తరబడి ఎదురు చూడకుండా మొదట్లోనే బోణి కొట్టింది భారత్. పారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళా షూటర్ మను భాకర్ కాంస్య పతకంతో సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మను భాకర్ 221.7 స్కోర్‌తో మూడో స్థానంలో నిలిచారు. ఒలింపిక్ మెడల్ సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గా మను భాకర్ చరిత్ర సృష్టించారు.
మరో వైపు బ్యాడ్మింటన్‌లో భారత క్రీడాకారిణి పీవీ సింధూ మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో అలవోకగా విజయం సాధించింది. మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి ఫాతిమా నబాన అబ్దుల్ రజాక్‌ను కేవలం 29 నిమిషాల్లోనే ఓడించింది. ఫాతిమా రజాక్‌పై 21-9, 21-6 తేడాతో పీవీ సింధు విజయం సాధించింది. కాగా బుధవారం తదుపరి మ్యాచ్‌లో సింధు తలపడనుంది. రోయింగ్‌లోని రిఫెఛేజ్ విభాగంలో భారత అథ్లెట్ బాలరాజ్ పన్వార్ క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. రిఫెఛేజ్ విభాగంలో మొనాకో అథ్లెట్ ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా.. బాలరాజ్ సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు.
గత ఒలింపిక్స్‌లో ఇండియా ఏడు పతకాలు సాధించింది. ఓ గోల్డ్ మెడల్ కూడా సాధించింది. సారి రెండు అంకెల పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత క్రీడా ప్రమాణాలు పెరుగుతూండటంతో అదేమి అసాధ్యం కాదని… భావిస్తున్నారు.