వైసీపీలో అల్ట్రా లెజెండ్స్ ఉంటారు. మీరు డెభ్బై వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు సార్ అంటే.. నా వీడియోకు ఐదు లక్షల వ్యూస్ వచ్చాయి …అంటే నేను పాపులర్… ఆ గెలిచినోడికి అడ్రస్ ఉండదు అని ఘనంగా వాదించేస్తారు. ఇలాంటి పార్టీలో మార్గానికి భరత్ మరో స్పెషల్ లీడర్. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ చానల్ కు ఇంటర్యూ ఇచ్చారు. తన ఓటమికి కారణాలు చెప్పే క్రమంలో… జగన్ చేతకాని తనాన్ని, తెలివి తక్కువ తనాన్ని కాస్త పొలైట్ గానే వ్యక్తం చేశారు.
ముఖ్యంగా లిక్కర్ విషయంలో వైసీపీకి బాగా దెబ్బపడిందని మార్గాని భరత్ చెప్పారు. ఎందుకంటే జగన్ కు ఏమీ తెలియదంటున్నారు. మనం టూత్ పేస్ట్ కొనేటప్పుడే నాలుగుు రకాలు చూస్తాం.. మరి మద్యం కొనేవాడు తనకు ఇష్టమైన బ్రాండ్ కొనుక్కునేందుకు చూడరా అని ఆయన డౌట్. ఇంత చిన్న లాజిక్ తనకు అర్థం అయింది కానీ జగన్ కు అర్థం కాలేదని ఆయన భావన. దీన్ని కూడా మార్గాని భరత్ కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ జగన్ కు తెలియదని.. ఆయనకు మద్యం అలవాటు లేదని .. అందుకే జగన్ తెలియదని కవర్ చేశారు. కోటి మంది మద్యం తాగేవాళ్లు ఉన్నారని వారు ఓటేయలేదని భర్త భావన.
జగన్ కు ఏమీ తెలియదనే… అరవై మందికిపైగా సలహాదారులను పెట్టుకున్నారు. కానీ వారెవరూ ఈ సమస్యను గుర్తించలేదా అంటే.. గుర్తించారు..కానీ జగన్ కు అంతా తెలుసు కాబట్టి ఏమీ చేయలేకపోయారు. జగన్ మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో ఏపీ ప్రజలకు అమ్మించిన లిక్కర్ ను ఆయన బినామీ ఫ్యాక్టరీల్లో తయారు చేసారు. వారే సరఫరా చేశారు. వారి పార్టీ కార్యకర్తలే మద్యం దుకాణాల్లో పని చేశారు. కేవలం నగదు లావాదేవీలు నిర్వహించారు. ఇంత పెద్ద స్కాంలో జగన్ పాత్ర కీలకం. కానీ మార్గాని భరత్ మాత్రం.. పాపం జగన్ కు ఏమీ తెలియదని.. తాగడని అందుకే అవగాహన లేదని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజం అందరికీ తెలుసు కదా !