టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని చెప్పుకునేందుకు వైసీపీ నేతలు చేస్తున్న ఘన కార్యాలు వెలుగులోకి వస్తూంటే వాళ్ల పరువు వాళ్ల నిర్వాకాల్లోనే అసలు పరువు తగలబడిబోతోంది. మార్గాని భరత్ తన ప్రచారావాహనాన్ని టీడీపీ నేతలు కాల్చేశారని వారం రోజు కిందట హడావుడి చేశారు. స్వయంగా అమరావతికి వెళ్లి డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితుడ్ని పట్టుకున్నారు. ఆ నిందితుడు ఎవరంటే ఎప్పుడూ భరత్ వెంట ఉంటే అనుచరుడే.
మార్గాని భరత్ ఎన్నికల ప్రచార రథం దగ్ధం కేసులో చిక్కుముడి వీడింది. నిందితుడు, వైసీపీ కార్యకర్త దంగేటి శివాజీ ని బొమ్మూరు పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 28 న మార్గాని ఎస్టేట్స్ కార్యాలయంలో ప్రచార రథాన్ని న శివాజీ తగలబెట్టాడు. భరత్ ఓడిపోవడంతో ప్రజల్లో సానుభూతి, టీడీపీకి చెడ్డ పేరు తెచ్చేందుకే రథాన్ని తగలబెట్టాడని తేలింది.
దీంతో భరత్ ఓ వీడియోను విడుద ల చేశారు. తాను సానుభూతి కోసం ఆ పని చేయలేదని కావాలంటే దేవుడి గుడిలో ప్రమాణానికి సిద్ధమని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు.. తనకు సింపతి ఎందుకు అని ఆయనంటున్నారు. వైసీపీ నేతల వ్యవహారాలు మరీ చీప్ గా ఉండటంతో ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు.