కరుణానిధి అంత్యక్రియల విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగిపోయింది. ఇతర తమిళ నాయకుల వల్లే కరుణానిధిని కూడా మెరీనా బీచ్ లోనే అంత్యక్రియలు చేయాలని కరుణానిధి కుటుంబ సభ్యులు భావించగా ప్రభుత్వం మాత్రం అక్కడ స్థలం ఇవ్వలేమని ప్రకటించారు అయితే డిఎంకె ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లింది.
హైకోర్టు చీఫ్ జస్టిస్ పిటిషన్ లు అన్నింటిని పరిశీలించి అంత్యక్రియలకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్లను కొట్టివేశారు. గతంలో మెరీనాలో స్మారక స్తూపాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ట్రాఫిక్ రామస్వామి తో సహా పలువురు కోర్టులో పిటిషన్లు వేశారు. మొత్తం ఈ అంశంపై ఉన్న ఐదు పిటిషన్లను ఇవాళ హైకోర్టు జస్టిస్ కొట్టివేశారు. అయితే ఈ విషయంలో తుది తీర్పు ఇవ్వలేదు. అయినప్పటికీ, పిటిషన్ లు కొట్టి వేయడం తో మెరీనా బీచ్ లోనే కరుణానిధి అంత్యక్రియలు చేయడానికి మార్గం సుగమం అయ్యింది. ఇక విద్యా సంస్థలు సినిమాహాళ్లు ఇంకా ఇతర సంస్థలు ఇవాళ స్వచ్ఛందంగా మూసివేశారు. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులంతా ఈ అంత్యక్రియలకు హాజరు కానున్నారు.