షెడ్డుకెళ్లిపోయిన కాంగ్రెస్ నేతలందరూ కాంగ్రెస్ పార్టీని మరింత దిగజార్చడానికి .. ఓపిక.. తీరిక చేుకుని మరీ మీడియా ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బాగున్నప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పి.. హైకమాండ్ వద్ద పలుకుబడి సంపాదించుకుని.. చాలా కాలం హవా చూపించిన మర్రి శశిధర్ రెడ్డి చాలా కాలం నుంచి సైలెంట్‌గా ఉన్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ నెత్తి మీద మరో దెబ్బకొట్టడానికి మీడియా ముందుకు వచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినట్లుగా.. పీసీసీ చీఫ్ పదవిని .. మాణిగం ఠాగూర్ అమ్ముకున్నారనిపిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఠాగూర్ రేవంత్ రెడ్డికి ఏజెంట్‌గా పనిచేస్తున్నాడని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సమాంతరంగా మరో వ్యవస్థ నడుస్తోందని.. గాంధీ భవన్ కాకుండా మరో కార్యాలయం కూడా ఉందన్నారు. నలభై ఏళ్లలో ఎప్పుడూ చూడనన్ని పరిస్థితులు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో కనిపిస్తున్నాయన్నారు. ప్రజలకు దూరమైన ఇలాంటి నేతలందరూ.. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి మేలుచేయకపోయినా కనీసం సైలెంట్‌గా ఉన్నా.. ఇంత కాలం తమను మోసిన పార్టీకి మేలు చేసిన వాళ్లయ్యే వారంటున్నారు.
కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినదంతా అనుభవించి ఇప్పుడు ఆ పార్టీనే టార్గెట్ చేయం ఏమిటని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఎలాగూ వారు యాక్టివ్గారాజకీయాలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు సొంత పార్టీని డ్యామేజ్ చేసేలా మాట్లాడితే ఏం ప్రయోజనం అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పెంచి పోషించిన నేతలు అలాటి వారే మరి.. ఎవరేం చేయగలరుఅని.. కార్యకర్తలు నిట్టూరుస్తున్నారు.