‘బ్రాండ్ బాబు’కి మారుతి కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాయడం మాత్రమే కాదు… ఒక్క రోజు డైరెక్షన్ కూడా చేశారు. ఈ విషయాన్ని హీరో సుమంత్ శైలేంద్ర ఈరోజు ఇంటర్వ్యూలో చెప్పాడు. అసలు సినిమాకి మారుతియే డైరెక్షన్ చేయాల్సిందట. హీరో కూడా ఆయన్నే డైరెక్షన్ చేయమని అడిగానని తెలిపాడు. ఇతర సినిమాలతో మారుతి బిజీగా వుండటంతో రెండేళ్లు వెయిట్ చేయమని చెప్పాడట. రెండేళ్లు అంటే లేట్ అవుతుందని భావించడంతో కథను తీసుకుని ఈటీవీ ప్రభాకర్ చేతిలో డైరెక్షన్ బాధ్యతలు పెట్టారు. మధ్య మధ్యలో మారుతి సెట్స్ కి వచ్చారని చెప్పాడు. ప్రభాకర్ బ్రదర్ మరణించడంతో ఆయన షూటింగుకు వెళ్లలేని పరిస్థితి ఒక రోజు ఏర్పడింది. ఆ రోజు మారుతి డైరెక్షన్ చేశారని సుమంత్ శైలేంద్ర తెలిపాడు. మారుతి డైరెక్షన్ చేసింది ఇంటర్వెల్ సీన్ అని చెప్పాడు. ఆగస్టు 3న విడుదలవుతోన్న ఈ సినిమాతో కన్నడలో నాలుగు సినిమాలు చేసిన సుమంత్ శైలేంద్ర తెలుగులో ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. తెలుగులో రాజ్ తరుణ్ హీరోగా ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ నిర్మించిన శైలేంద్రబాబు కుమారుడు ఇతను. ఇకపై తెలుగు మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తానని చెబుతున్నాడు.