మిర్యాగలగూడలో ఎనిమిది నెలల క్రితం సంచలనం సృష్టించిన ప్రణయ్ అనే యువకడి హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావుకి.. హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పత్రాలన్నీ సమర్పించడంతో.. ఆయన బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. మారుతీరావుతో పాటు ఆయన సోదరుడు శ్రవణ్‌కుమార్ , కాంగ్రెస్ నేత అబ్దుల్ కరీంకు కూడా బెయిల్ లభించింది. అయితే.. మారుతీరావు నుంచి తనకు… తన కుటుంబానికి ప్రాణహానీ ఉందని… ఆయనకు బెయిల్ రద్దు చేయాలని..మారుతీరావు కుమార్తె అమృత డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పోలీసులు స్పందించారు. బెయిల్ రద్దు కోసం సుప్రీంకోర్టుకు వెళ్తామని… అమృత కుటుంబానికి రక్షణ కల్పిస్తామని ప్రకటించారు.
ప్రణయ్‌ను కిరాయి హంతకులతో చంపించిన నేరాన్ని ఎదుర్కొంటున్న మారుతీరావు ఎనిమిది నెలలుగా జైల్లో ఉన్నారు. ఆయన బెయిల్ కోసం అనేక సార్లు ప్రయత్నించారు. చివరికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ లోపే.. ఆయన కుమార్తె… అమృత.. ఓ మగబిడ్డకు తల్లి అయింది. ప్రణయే మళ్లీ జన్మించాడని.. అమృత సంతోష పడుతోంది. ఈ ఎనిమిది నెలల కాలంలోనూ.. తండ్రిపై.. అమృతకు కోపం… తగ్గలేదు. ఆ విషయం మీడియాతో మాట్లాడినప్పుడు వెల్లడయింది. అమృతరావుకు బెయిల్ వచ్చిందన్న విషయం తెలిసిన తర్వాత మీడియా మొత్తం… అమృత స్పందన కోసం వాళ్లింటికి వెళ్లింది. అప్పుడే… బెయిల్ రద్దు చేయాలనే డిమాండ్‌ను అమృత బయటపెట్టింది.
ప్రణయ్ హత్య జరిగినప్పుడు… ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు కారణం అయింది. కొంత మంది మారుతీరావుని.. మరికొంత మంది అమృతను సమర్ధిస్తూ.. వాదోపవాదాలకు దిగారు. అయితే.. ఓ మనిషిని చంపించడాన్ని మాత్రం ఎవరూ సమర్థించలేదు. కుటుంబపరమైన ఈ కేసులో.. కులాలు చొచ్చుకురావడం.. రాజకీయ అంశంగా మారడంతో… ఎప్పటికప్పుడు.. హైలెట్ అవుతూనే ఉంది. అమృత ప్రైవసీని కూడా మీడియా పట్టించుకోవడం లేదు. బిడ్డ పుట్టినప్పుడు…కూడా కవరేజీ ఇచ్చారు. మారుతీరావుకు బెయిల్ ఇచ్చినప్పుడూ మీడియా అంతే హడావుడి చేసింది.