మారుతి దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా ఓ పాన్ ఇండియా సినిమా రూపుదిద్దుకొంటోంది. ఈ కథకు ప్రభాస్ ఎప్పుడో ఓకే చెప్పేశాడు. కానీ… డేట్లు సర్దుబాటు కావడం లేదు. ఇప్పటికే మారుతి చాలా కాలం నుంచి వెయింటింగ్ లో ఉన్నాడు. ఇక… ప్రభాస్ లేకపోయినా, ఈ సినిమాని పట్టాలెక్కించేయాలన్న నిర్ణయానికి వచ్చాడు. ఈ సినిమా కోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ సెట్ ని తీర్చిదిద్దుతున్నారు. అందులో షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా ప్రభాస్ లేని సీన్లన్నీ తీసేసే విధంగా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. నవంబరు నుంచి ప్రభాస్ డేట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. `ప్రేమకథా చిత్రమ్` తరహాలోనే సాగే కథ ఇది. హారర్ ఎలిమెంట్స్ ఉంంటాయి. దాంతో పాటుగా…. థ్రిల్లింగ్ మూమెంట్స్, ట్విస్టులూ జోడించుకుని వెళ్లాడట మారుతి. నిధి అన్వేషణ కూడా ఈ కథలో కీలక భాగం కానుంది. సంజయ్‌దత్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. తమిళ హాస్య నటుడు యోగిని ఓ పాత్ర కోసం ఎంచుకొన్నారు. సినిమాలో సగ భాగం ఒకే సెట్లో జరగబోతోంది.