మెగా కుటుంబంతో మారుతికి విడదీయరాని అనుబంధం ఉంది. అల్లు శిరీష్ తో తప్ప.. మెగా హీరోలెవరితోనూ సినిమాలు చేయకపోయినా మంచి రాపో ఏర్పడింది. అల్లు అర్జున్ కి మారుతి చాలా క్లోజ్. అల్లు అరవింద్ తోనూ ఎప్పుడూ టచ్‌లో ఉంటాడు. గీతా ఆర్ట్స్‌లో భలే భలే మగాడివోయ్ సినిమా చేశాడు మారుతి. ఇప్పుడు ఆహా కోసం రెండు కథల్ని సిద్ధం చేశాడట. ఆహా ఎక్స్‌క్లూజీవ్ పేరుతో.. కొన్ని వెబ్ మూవీస్ ని నిర్మించడానికి రెడీ అయ్యింది ఆహా. అందుకోసం కొంతమంది యువ దర్శకులతో డీల్ కుదుర్చుకుంటోంది. ఓ ప్యాకేజీలా మాట్లాడుకుని, సినిమాల బ్యాంక్ పెంచుకుంటోంది. అందుకోసం మారుతి రెండు కథలు రెడీ చేసి పెట్టుకున్నాడట. తక్కువ లొకేషన్లు, పరిమిత బడ్జెట్ తో ఈ రెండు కథల్ని పూర్తి చేయాలనుకుంటున్నాడట. అయితే ఈ సినిమాలకు మారుతి దర్శకత్వం వహించడు. తన శిష్యులకు ఆ బాధ్యత అప్పగిస్తాడు. మారుతిలా ఇద్దరు ముగ్గురు యంగ్ డైరెక్టర్లు ఆహా కోసం కథలు రెడీ చేస్తున్నారని తెలుస్తోంది.