‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి సూపర్ హిట్ చిత్రాల్ని అందించిన స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ ఇప్పుడు ఓ వైవిధ్యభరితమైన ప్రయత్నం చేస్తోంది. అదే.. ‘మసూద’. సాయికిరణ్ దర్శకత్వం వహించిన చిత్రమిది. సంగీత, తిరువీర్, కావ్య కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రలు పోషించారు. నవంబరు 11న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ప్రకటించారు.
”మా బ్యానర్లో వచ్చిన రెండు సినిమాలూ సూపర్ హిట్టయ్యాయి. వసూదతో హ్యాట్రిక్ కొడతాం. ఇదో హారర్ డ్రామా. ఓ మంచి హారర్ డ్రామాని చూసి చాలా కాలమైంది. ఆ లోటుని ‘మసూద’ తీరుస్తుందన్న నమ్మకం ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తెలుగుతో పాటు హిందీ తమిళ భాషల్లోనూ ఈ సినిమాని ఒకేసారి విడుదల చేస్తున్నాం” అన్నారు నిర్మాత. ప్రశాంత్ ఆర్.విహారి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.