‘ఆర్ఎక్స్100’సినిమాతో మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు కార్తికేయ. తర్వాత హిప్పీ, 90ML లాంటి సినిమాలు చేశాడు. కానీ వర్క్ అవుట్ కాలేదు. ఈసారి మరోసారి మాస్ పల్స్ పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం ‘చావు కబురు చల్లగా. ఇప్పటికే విడుదలైన ’ ఈ చిత్రం టీజర్ గ్లింప్స్ ఆకట్టుకుంది. మాస్లుక్తో అలరించాడు.
ఇప్పుడు ఈ సినిమా నుండి ఓ మాస్ పాట వదిలారు. అదే ”మై నేమ్ ఈజ్ రాజు”. నిజానికి ఇదో చావు పాట. ఇలాంటి పాటలు పేధాస్ టచ్ లో వుండి… తత్వం వల్లిస్తాయి. కానీ ఈ పాట మాత్రం… మాస్ కి నచ్చేలా రూపొందించారు. చాలా క్యాచిగా వుంది.
ముఖ్యంగా సాహిత్యం మాస్ ని ఆకట్టుకునేలా వుంది. ”ఎట్టా ఎట్టా ఎట్టా గా పుట్టావురో .. అట్టా అట్టా అట్టాగె పోతావురో .. ఇట్టే ఇట్టే ఇట్టే ఫీలైపోతారేందిరోయ్ .. సత్తే సత్తే సత్తే ఏమౌతాది రోయ్ .. గాల్లో దీపం .. గుండెల్లో ప్రాణం.. ఎప్పుడు తుస్ అంటుందో ఎవడికి తెలుసునులేరా.. వంట్లో జీవం కాదే మన సొంతం.. వున్నన్నాళ్ళు పండగ చేసి పాడెక్కేరా ..అంటూ సాగిన ఈ పాట మాస్ కి నచ్చేలా వుంది.
సినిమాలో కార్తికేయ మార్చురీ వ్యాన్ నడిపే డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్. గీతా ఆర్ట్స్-2 పతాకంపై బన్నీవాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు కౌషిక్ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.