అందరి దృష్టీ ‘మహానటి’పై పడింది. అలాంటిలాంటి జీవితం కాదది. తెలుగు తెరపై దేదిప్యమానంగా వెలిగిన ‘సావిత్రి’ అనే ఓ మహానటి కథని తెరపైకి తీసుకొస్తున్నారు. దానికి తోడు కీర్తి సురేష్, సల్మాన్ దుల్కర్, సమంత, మోహన్ బాబు… ఇలా బోలెడంత మంది నటీనటులు. వైయంతీ మూవీస్ నిర్మాణం… ఇలా అన్నీ విశేషాలే. సావిత్రి జయంతి సందర్భంగా టీజర్‌లాంటిది విడుదల చేశారు. ఓపెనింగ్ బ్రహ్మాండంగా ఉంది.
‘అది ప్రియదర్శిని వదిన… ఆ పేటిక తీసి చూస్తే…’ అనే ‘మాయా బజార్’ డైలాగ్‌తో మొదలెట్టారు.
అలిగిన వేళనే చూడాలి, నాకు జీవించడానికే ఇష్టం లేదు. నన్ను వదిలి నీవు పోలేవులే… ఇలా ఒకొక్కటిగా సావిత్రి మైలురాళ్లని గుర్తు చేస్తూ.. చాతా తెలివిగా, అందంగా టీజర్ డిజన్ చేశారు. సావిత్రిగా కీర్తి సురేష్ లుక్ కనిపించకుండా.. ఆ లోటు రానివ్వకుండా తెలివితేటలు ప్రదర్శించారు. అంతా బాగానే ఉంది. చివర్లో ‘మహానటే… మహనటే..’ అంటూ అదేదో మాస్ సినిమాలా… అరిచి గోల పెట్టి ఆపారు. ఆ ఓపెనింగ్కీ, ఆ ఎండింగ్కీ ఏమాత్రమైనా సంబంధం ఉందా?? అనిపిస్తోంది. ఇదేమైనా మాస్, కమర్షియల్ హీరో సినిమానా?? ఓ మహానటి జీవితం. దానికీ, చివర్లో వినిపించిన ఆ అరుపులాంటి ఆర్.ఆర్కీ ఏమాత్రం సంబంధం లేదేమో అనిపిస్తుంది. మొత్తానికి ఓ మంచి థీమ్ చూశామన్న ఫీలింగ్‌ని అదొక్కటీ పాడు చేసింది. దాన్ని మినహాయిస్తే… ‘మహానటి’ టీమ్ ఆలోచన అద్భుతంగా ఉంది.