అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా…మరో 20 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. విషమంగా ఉన్నవారిని అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు భారీగా ఎగిసిపడిన మంటలను అదుపు చేసేందుకు ఫైర్ ఇంజిన్ సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రియాక్టర్ పేలుడు శబ్దంతో ఏం జరిగిందోనని గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురి అయ్యారు.
మరోవైపు కంపెనీలో చిక్కుకుపోయిన కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే , ఈ ప్రమాదానికి కారణం ఏంటి..? అనే కారణాలు తెలియాల్సి ఉంది.