ఏపీ ప్రభుత్వం డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ పేరుతో వైసీపీ ప్రచారాలు చేస్తున్నారు. అయితే కొంత మంది నేరగాళ్లు ఈ కార్పొరేషన్ ను అడ్డం పెట్టుకుని కొత్త కొత్త నేరాలకు పాల్పడుతున్నారు. ఏపీలో చాలా మందికి.. ముఖ్యంగా వైసీపీ తో సంబంధాలు ఉన్న వారికి.. ఏపీ డిజిటల్ అగ్రో కార్పొరేషన్ పేరుతో కవర్లు వచ్చాయి. అదీ కూడా స్పీడ్ పోస్టులో. కవర్లు వస్తే తీసుకోవడానికి ఏమీ ఇబ్బంది ఉండదు.. కానీ తీసుకోవాలంటే.. రూ. 499 .. అంత కంటే ఎక్కువే కట్టాలి. అంటే.. ఆన్ లైన్ షాపింగ్ చేసినప్పుడు.. పే ఆన్ డెలివరీ టైప్ అన్నమాట.
ఇలా పెద్ద ఎత్తున వచ్చిన కవర్లలో.. డిజిటల్ కార్పొరేషన్ నుంచి తమకు ఏదో పంపారని ఎక్కువ మంది ఆశపడ్డారు. ఇలాంటి వారిలో ఎక్కువగా మంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఉన్నారు. డబ్బులు కట్టి తీసుకున్నారు. తీరా చూస్తే కవర్లో ఏమీ లేదు. తమ పోస్టులకు మెచ్చి డిజిటల్ కార్పొరేషన్ నుంచి ఏదో బహుమతి వచ్చిందనుకున్న వారికి షాక్ తగిలింది. విషయాన్ని పెద్దలకు చెబితే.. తాము అలాంటి కవర్లు ఏమీ పంపలేదని స్పష్టం చేశారు. అయితే ఒకరిద్దరికి కాదు.. చాలా మందికి వచ్చినట్లుగా.. ఎక్కువ మంది మోసపోయినట్లుగా తేలడంతో.. పోలీసులు వెంటనే ఏపీ ఫ్యాక్ట్ చెక్ ను అలర్ట్ చేశారు.
వైసీపీ డిజిటల్ మీడియా కార్యకర్తల్ని.. ఇతరుల్ని అలెర్ట్ చేయడమే లక్ష్యంగా వెంటనే ఫ్యాక్ట్ చెక్ ఓ పోస్టు పెట్టింది. అలాంటి కవర్లు ఎవరికి వచ్చినా తీసుకోవద్దని హెచ్చరించింది. ఆ కవర్ మీద ఏపీ డిజిటల్ అగ్రో కార్పొరేషన్ అని ఉందని.. అలాంటిదేదీ ఏపీలో లేదని ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసంది. డిజిటల్ కార్పొరేషన్ అలాంటి కవర్లు పంపడం లేదని తెలిపింది. ఈ కవర్లు అన్నీ యూపీ నుంచి వస్తున్నట్లుగా గుర్తించారు. తదుపరి ఏమైనా కేసులు నమోదు చేస్తారో లేదో కానీ. .. ఇప్పటికైతే వందల మంది వైసీపీ కార్యకర్తలు.. తలా ఐదు వందలు నష్టపోయారు. వారికి అది పెద్ద విషయం కాదు కానీ.. అందరిదీ కలిపితే పెద్ద మొత్తమే.