మాస్టర్ ప్లానర్ IPS రంగనాథ్ !

తాడి తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు ఇంకొకడు ఉంటాడని సామెత. ప్రతి విషయంలోనూ ఇది రుజువు అవుతూనే ఉంటుంది. ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కబ్జా రాయుళ్ల విషయంలో అలాగే కనిపిస్తున్నారు. చెరువుల్ని మింగేసి ఏళ్లు గడుస్తున్నా.. తమ జోలికి ఎవరూ రాకుండాచూసుకుంటున్న వారి ప్లాన్లకు విరుగుడు సరైన పద్దతిలోనే అమలు చేస్తున్నారు. ఆయన వ్యూహాల్ని గుర్తించలేక కబ్జా దారులు కూడా విలవిల్లాడిపోతున్నారు.

ఇప్పటి వరకూ ఎవరూ ఎన్ కన్వెన్షన్ జోలికి వెళ్లలేకపోయిన వైనం

నాగార్జున వైఎస్ హయాంలో ఎన్ కన్వెన్షన్ కట్టారు. కట్టినప్పటి నుంచి వివాదాలే. కానీ రెండు దశాబ్దాలు గడిచినా ఒక్కరూ ఆ కన్వెన్షన్ జోలికి వెళ్లలేకోయారు. రాజకీయ బలం…కోర్టుల్లో పిటిషన్లు బేస్ చేసుకుని అటు వైపు పోకుండా చూసుకున్నారు. ఒక్క ఎన్ కన్వెన్షన్ కాదు… రంగనాథ్ నేతృత్వంలో ఇటీవల కూల్చివేసిన అనేక నిర్మాణాల యజమానులు పలుకుబడి ఉన్నవారే. ముందుగా తెలిస్తే ఏదో ఓ రూపంలో అడ్డుకుని తమ నిర్మాణాలను కాపాడుకునేవారే. ఈ విషయం తెలుసు కాబట్టి.. ఆయా యాజమానులు షాక్ అయ్యేలా.. షాక్ నుంచి తెరుకునేసరికి నేలమట్టమయ్యేలా మెరుపు వేగంతో ప్లాన్లు అమలు చేస్తున్నారు.

ఎలాంటి చాన్స్ ఇవ్వకుండా పక్కాగా కూల్చివేతలు

ముందుగా టార్గెట్ ఫిక్స్ చేసుకుంటున్నారు, బ్యాక్ గ్రౌండ్ వర్క్ అంతా రహస్యంగా పూర్తి చేస్తున్నారు. యాక్షన్ లోకి దిగే రోజున ఉదయమే ఎంట్రీ ఇస్తున్నారు. ఎలాంటి కట్టడం అయినా మూడు, నాలుగు గంటల్లో కూల్చివేత పూర్తి చేస్తున్నారు. ఎవరూ కూల్చివేత ల వద్దకు రాలేకపోతున్నారు. ఆయా యజమానులు ఏం చేయాలా అని కిందా మీదా పడి నిర్ణయం తీసుకునేలోపు పని అయిపోతుంది. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అప్పటికే కూలిపోయి ఉంటుంది.

నెక్ట్స్ ఎవరో అని నిద్రలేని బీఆర్ఎస్ నేతలు

ఐపీఎస్ అధికారి రంగనాథ్ ఈ వ్యూహాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. ఆయన దెబ్బకు ఆక్రమణ దారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. నాగార్జున తరవాత ఇప్పుడు మల్లారెడ్డి, పల్ల రాజేశ్వర్ రెడ్డి వంటి వారికి కంటి మీద కునుకులేకుండా పోయింది. యూనివర్శిటీల పేరుతో వీరు కుంటల్ని .. చెరువుల్ని మింగేసి కట్టడాలు చేశారు. బహుశా వచ్చే వారం వీరికి ముహుర్తం ఉండవచ్చు. అందుకే ముందస్తుగా హైకోర్టుకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌న‌సేన‌లోకి బాలినేని… జ‌గ‌న్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తాను ఏనాడూ ఏదీ ఆశించ‌కుండా, మంత్రిప‌ద‌విని సైతం వ‌దులుకొని జ‌గ‌న్ వెంట న‌డిస్తే... నాపై ఇష్టం వ‌చ్చినట్లు మాట్లాడిస్తున్నా ప‌ట్టించుకోలేద‌ని మాజీ మంత్రి బాలినేని మండిప‌డ్డారు. జ‌గ‌న్ వెంట‌నే క‌ష్ట‌కాలంలో న‌డిచిన 17మంది...

కిల్’ రీమేక్‌: ఏ స్టూడియోస్ + ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్‌

బాలీవుడ్ లో ఘ‌న విజ‌యాన్ని అందుకొన్న సినిమా 'కిల్‌'. తెలుగులో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తార‌ని కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. బ‌డా బ‌డా నిర్మాణ సంస్థ‌లు రీమేక్ రైట్స్ కోసం పోటీ పడ్డాయి....

ఎక్స్‌క్లూజీవ్‌: గ‌ప్ చుప్ గా ప్ర‌భాస్ సినిమా

ప్ర‌భాస్ - హ‌ను రాఘ‌వ‌పూడి కాంబోలో ఓ సినిమా ఇటీవ‌లే లాంఛ‌నంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీస్ సంస్థ ఈచిత్రాన్ని నిర్మిస్తోంది. బుధ‌వారం నుంచే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది....

నాగ‌బాబు ట్వీట్… జానీ మాస్ట‌ర్ ఇష్యూ మీదేనా?

జ‌న‌సేన నేత‌, ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ పై లైంగిక ఆరోప‌ణ‌లు రాగా కేసులు కూడా న‌మోద‌య్యాయి. ప‌రారీలో ఉన్న జానీ మాస్ట‌ర్ ను సైబ‌రాబాద్ పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close