కేసీఆర్ కాదు పో అన్నాడు. ఛీకొట్టాడు… ఆఖరుకు కేటీఆర్ మాట్లాడిన లాభం లేదు. కేటీఆర్ మధ్యలో వచ్చి కేసీఆర్ కు సదరు నేతకు మధ్య రాయభారం నడిపాడు. కానీ, కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్ తో శపథం చేసి మరీ బయటకు వచ్చి, ఇప్పుడు బీఆరెఎస్ కు చుక్కలు చూపిస్తున్నాడు. సీఎం రేవంత్ వ్యూహాన్ని అమలు చేస్తూ బదులు తీర్చుకుంటున్నాడు.
అవును… ఆయనే మంత్రి పొంగులేటి. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ గ్రూపు రాజకీయాలతో విసిగి, కేసీఆర్ అవమానాలతో బయటకు వచ్చారు. నీ ఎమ్మెల్యేలను ఖమ్మం జిల్లా నుండి అసెంబ్లీ గేటు తాకనివ్వను అంటూ ప్రచారం చేశారు. ఆర్థికంగా కాంగ్రెస్ నేతలకు అండగా ఉంటూ అన్నది చేసి చూపించారు. అంతటితో ఆగలేదు రేవంత్ రెడ్డి సర్కారులో బీఆర్ఎస్ కు నిద్రలేని రాత్రులను చూపిస్తున్నారు.
బీఆర్ఎస్ నుండి ఏ ఎమ్మెల్యే పార్టీ మారినా, ఎమ్మెల్సీ పార్టీ మారినా… సీనియర్ నేత కాంగ్రెస్ లోకి ఎవరొస్తున్నా సరే రేవంత్ రెడ్డితో పాటు ఉండేది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అవును… వ్యూహాలను పక్కాగా అమలు చేసి, బీఆర్ఎస్ కు తెలియకుండా జాగ్రత్తపడి… నేతలతో సంప్రదింపులు చేసి, పార్టీలో చేరే వరకు దగ్గర ఉంటున్నారు.
మా సారు పొంగులేటి విషయంలో ఆనాడు కాస్త వెనక్కి తగ్గి ఉంటే… పొంగులేటి విషయంలో కేసీఆర్ కనీసం కేటీఆర్ మాట అయినా విని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని బీఆర్ఎస్ క్యాడరే ఫీల్ అవుతుందంటే సీన్ అర్థం చేసుకోవచ్చు.