బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి.. సామాన్యంగా ఇతర పార్టీల నేతలకు అంత గౌరవం ఇవ్వరు. ఆమె భావజాలం ఆమెది. ఆమె ప్రచార సభల్లో కానీ.. ఇతర కార్యక్రమాల్లో కానీ.. ఆమె.. తనదే పైచేయి అన్నట్లుగా వ్యవహరిస్తారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే.. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో … సమావేశం కోసం లక్నో నుంచి ప్రత్యేకంగా ఢిల్లీ వచ్చారు. చంద్రబాబు ఆమెతో ముప్పావు గంట సేపు చర్చలు జరిపారు. ఆ తర్వాత వెళ్లేటప్పుడు.. మొదట ఇంటి గుమ్మం దగ్గర వీడ్కోలు పలికారు. అయితే.. చంద్రబాబు కారు ఎక్కి కూర్చుని డోర్ వేసుకున్న తర్వాత మళ్లీ కార్ దగ్గరకు వచ్చారు. ఆమె వచ్చిందని.. చంద్రబాబు కారు దిగే ప్రయత్నం చేస్తూండగానే.. వారించి.. చంద్రబాబు తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. ఈ హఠాత్పరిణామానికి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు.
మాయావతి చంద్రబాబుతో అంత ఆప్యాయంగా వ్యవహరించడంతో.. ఢిల్లీ రాజకీయవర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. దానికి కారణంగా.. నాలుగు రాష్ట్రాల ఎన్నికలే. మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్ గఢ్, మిజోరంలలో … కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. కానీ ఆ నాలుగు రాష్ట్రాల్లో దళితుల్లో… బీఎస్పీకి మంచి పట్టు ఉంది. నాలుగైదు శాతం ఓటు బ్యాంక్ వరకూ ఉంది. యూపీలో మహాకూటమిగా ఏర్పడిన పార్టీలు… ఆయా రాష్ట్రాల్లోనూ కలసి పోటీ చేస్తాయనుకున్నారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ.. బీఎస్పీ మాత్రం.. ఒంటరి పోరుకు సిద్ధమయింది. దీంతో.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి బీజేపీ లాభపడే పరిస్థితి వచ్చింది. ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు సెమీ ఫైనల్స్ లాంటివి. సార్వత్రిక ఎన్నికలపై ఈ ప్రభావం ఉంటుంది. బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో మరోసారి గెలవనీయకూడదనుకుంటున్న చంద్రబాబు… ఈ పరిస్థితిని తప్పించడానికే.. మాయావతితో సమావేశమయ్యారన్న ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్లుగానే.. వారిద్దరి మధ్య.. బీఎస్పీ- కాంగ్రెస్ మధ్య వచ్చిన పొరపొచ్చాల గురించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
మాయావతి… చంద్రబాబుతో చర్చల తర్వతా మనసు మార్చుకుని.. బీజేపీని ప్రథమ శత్రువుగా పరిగణించి.. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు సిద్ధపడితే.. బీజేపీకి పెద్ద షాక్ తగిలినట్లే భావింవచ్చు. అలా కాకపోయినా… కాంగ్రెస్ పార్టీతో.. అంతర్గత అవగాహనకు వచ్చినా.. బీజేపీకి ఇబ్బందికరమే. కొన్ని బలమైన స్థానాల్లో మాత్రమే బీఎస్పీ పోటీ పడి.. మిగిలిన చోట్ల కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు బాగా ప్రయోజన కలుగుతుంది. చంద్రబాబు ఈ కోణంలోనే ఆమెకు సూచనలు చేశారని తెలుస్తోంది. భవిష్యత్ లో కలసి పని చేద్దామని.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాయావతి చెప్పి పంపించారు. అంటే.. జాతీయ స్థాయి కూటమిని … మరితంగా బలోపేతం చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయినట్లేననుకోవచ్చు.