సినిమా ఆడించడానికి కంటెంట్ లో బలంతో పాటు ప్రేక్షకులు మూడ్ చాలా ఇంపార్టెంట్. ఆడియన్స్ మూడ్ లెక్క చేయకుండా వచ్చిన సినిమాలు బాక్సాఫీసు ముందు సంచలనాలు సృష్టించిన దాఖలాలు పెద్దగా లేవు. సంక్రాంతి, వేసవి, దసరా, దీపావళి సీజన్లు ఊరకనే పాపులర్ కాలేదు. ప్రజలు వినోదాన్ని కొరుకునే సీజన్లు ఇవి. అయితే కొన్నిసార్లు తప్పని పరిస్థితిలో అన్ సీజన్లో పడిపోతుంటాయి కొన్ని సినిమాలు. సందీప్ కిషన్ ‘మజాకా’ పరిస్థితి అలానే వుంది.
ధమాకా లాంటి కమర్షియల్ విజయం తర్వాత త్రినాథ్ నక్కిన చేసిన సినిమా ఇది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనుకొని దిగారు. ముందు సంక్రాంతికి అనుకున్నారు. కానీ కుదరలేదు. తర్వాత మహాశివరాత్రి మంచి రోజున రిలీజ్ చేశారు. కంటెంట్ లో దమ్ము తగ్గింది. సరైన రివ్యూలు రాలేదు. పైగా సంక్రాంతి తో పాటు మధ్యలో వచ్చిన తండెల్ లాంటి సినిమాలకు ఫుట్ ఫాల్స్ ఇచ్చిన ఆడియన్స్ మజాకాకి వచ్చేసరికి థియేటర్స్ కి రావడానికి పెద్ద ఆసక్తి చూపించలేదు. దీంతోపాటు సినిమా ప్రమోషన్స్ చాలా హడావిడిగా చేశారు. జనాల్లో అస్సల్ బజ్ క్రియేట్ అవ్వలేదు.
పైగా ఇప్పుడు ఐసిసి ఛాంపియన్ ట్రోపీ నడుస్తోంది. యూత్ ఫోకస్ అంతా మంచి ఫామ్ లో ఇండియా జట్టుపై వుంది. రెగ్యులర్ ఆడియన్స్ కి కూడా కొత్త సినిమాల గురించి ఆలోచించే మూడ్ కనిపించడం లేదు. బుక్ మై షో ఓపెన్ చేసి ట్రెండ్ గమనిస్తే అంతా వరి పైరులా పచ్చగా కనిపిస్తోంది. అటు నిర్మాతలు కూడా ప్రస్తుతం వున్న బజ్ చూసి పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ పై కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. నిజానికి ఈ సినిమా సంక్రాంతికి వచ్చివుంటే ఈ తండ్రి కొడుకుల ఫ్యామిలీ ఫోటో కథకి ఆడియన్స్ నుంచి కొంత ఊపు దొరికేది. కానీ ఇప్పుడు అంతా రాంగ్ టైమింగ్ అయిపొయింది.