మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లిమీన్… ఎంఐఎంకు హైదరాబాద్ పాతబస్తీలో ఎదురు లేదు. చానాళ్ల కిందట.. మజ్లిస్ బచావో తెహరిక్.. ఎంబీటీ అనే పార్టీ.. వీరికి కొన్ని స్థానాల్లో గట్టి పోటీ ఉండేది. అసెంబ్లీలో ప్రాతినిధ్యం కూడా ఉండేది. అప్పట్లో.. ఎంఐఎం అంటే.. కాంగ్రెస్ పార్ట మిత్రపక్షం. ఎంబీటీకి… తెలుగుదేశం పార్టీ అండగా ఉండేది. కానీ రాను రాను.. ఎంబీటీని నడిపించేవారు తగ్గిపోయారు. ఆ పార్టీకి చెందిన ముఖ్యనేత మరణం.. ఆ తర్వాత వారసులు … ఓవైసీ బ్రదర్స్‌తో పోటీ పడలేకపోవడంతో.. వెనుకబడిపోయారు. ఇప్పటికీ.. ఎంబీటీకి… పాతబస్తీలో మద్దతు ఉంది. రెండు, మూడు కార్పొరేటర్ స్థానాలు గెల్చుకోగగలిగే పరిస్థితుల్లో ఆ పార్టీ ఉంది. ఆ పార్టీకి.. బయట నుంచి బలమైన మద్దతు దొరికితే… ప్రభావం చూపగలదు. ఈ పరిస్థితిని అంచనా వేసిన కాంగ్రెస్ పార్టీ.. పాతబస్తీలో ఈ సారి… ఎంబీటీని పైకి తీసుకు రావాలని నిర్ణయించుకుంది.
గతంలో ఎంఐఎం కాంగ్రెస్ వైపు ఉంటే.. టీడీపీ.. ఎంబీటీ వైపు ఉండేది. కానీ ఇప్పుడు… ఎంఐఎం టీఆర్ఎస్ వైపు ఉంది. కాబట్టి.. ఈ సారి ఎంబీటీని ప్రొత్సహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ఈ మేరకు… ఎంబీటీని పాతబస్తీలో మజ్లిస్‌కు వ్యతిరేకంగా నిలబెట్టాలని నిర్ణయించారు. పాతబస్తీలోని ఏడు సీట్ల విషయమై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్ దాస్ కమిటీతో కాంగ్రెస్ ముఖ్య నేతలు చర్చలు జరిపారు. ఈ స్థానాల్లో ఎంఐఎంకు పోటీగా కాంగ్రెస్, ఎంబీటీ ఉమ్మడి అభ్యర్థులను బరిలోకి దింపాలని పార్టీ నేతలు నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు ఇరుపార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. పొత్తులో చంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఎంఐఎం అగ్రనేత అక్బరుద్దీన్ఒవైసీపై మహమ్మద్ పహిల్వాన్ లేదా ఆయన కుటుంబసభ్యులను బరిలోకి దింపాలని నిర్ణయించారు. మహమ్మద్ పహిల్వాన్ కొడుకు గురువారమే భక్తచరణ్దాస్ను కలిశారు.
ఈ పహిల్వాన్… అక్బరుద్దీన్ ఓవైసీపై.. హత్యాయత్నం చేసిన కుటుంబానికి చెందిన వారు. ఈయన నిర్దోషిగా బయటపడ్డారు. అక్బర్‌పై ఆయననే పోటీకి నిలబెట్టనున్నారు. ఎంబీటీకి చెందిన అమానుల్లా ఖాన్ సహా మరికొంత మంది నేతలు.. పోటీకి సిద్ధంగా ఉన్నారు. ఈ పొత్తులో భాగంగా ఓల్డ్‌సిటీ భారాన్ని ఎంబీటీ పార్టీకే వదిలేయాని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. అంటే.. ఈ సారి హైదరాబాద్ పాతబస్తీలో… ఏకపక్షంగా ఓటింగ్ జరిగే అవకాశం లేకపోవచ్చు. మజ్లిస్ బ్రదర్స్ ను ఢికొడతారు అన్న నమ్మకం కలిగితే… ప్రజలు… ఎంబీటీ వైపు మొగ్గినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదనేది.. కాంగ్రెస్ భావన.