తన సినిమా విషయంలో నూటికి నూరు పాళ్లు ఇన్వాల్వ్ అవుతాడు దిల్‌రాజు. ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూడా ఆయన ప్రమేయం ఉండాల్సిందే. ఎంసీఏ విషయంలోనూ అదే జరుగుతోంది. అఖిల్ సినిమా హలోకి పోటీగా బరిలోకి దిగుతున్న సినిమా ఇది. దిల్‌రాజు బ్రాండ్, నాని ఇమేజ్, సాయి పల్లవి క్రేజ్ – ఇవన్నీ చూసుకుని మురిసిపోవడం లేదు దిల్‌రాజు. ఆఖరి నిమిషంలో కూడా టెన్షన్ పడుతున్నారు. సినిమా సెన్సార్ అయ్యాక మళ్లీ దిల్‌రాజు ఓసారి చెక్ చేసుకున్నారు. లాస్ట్ పంచ్ ఇచ్చేశారు. ఫస్ట్ ఆఫ్‌లో రెండు సీన్లను కత్తిరించిన దిల్‌రాజు.. సెకండాఫ్‌లో సీన్ ఆర్డర్‌ని మార్చినట్టు తెలుస్తోంది. సినిమా నిడివి తగ్గించాలన్న ఉద్దేశమో, లేదంటే అనవసరమైన చెత్త తొలగించాలన్న అభిప్రాయమో తెలీదు గానీ – ఎంసీఏ లో సన్నివేశాలకు కత్తెర్లు పడ్డాయి. వరుసగా హిట్లు కొడుతున్న దిల్‌రాజుకి ఈ సినిమా మరీ మరీ ముఖ్యం. `డబుల్ హ్యాట్రిక్ కొట్టా` అని చెప్పుకోవడానికి ఆయనకు దక్కిన అరుదైన అవకాశం. అందుకే.. దిల్‌రాజు ఆఖరి నిమిషాల్లోనూ ఇంతలా టెన్షన్ పడుతున్నాడేమో! మరి ఈ కత్తెర్లు.. ఎంసీఏని గట్టెక్కిస్తాయా, డబుల్ హ్యాట్రిక్ అందిస్తాయా?? వెయిట్ అండ్ సీ.