చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకున్న తర్వాత ఏపీలో నీలి, కూలి మీడియా, సోషల్ మీడియాల్లో ఆర్తనాదాలు ఎక్కువగా వినిపించాయి. అవి ఏ స్థాయికి వెళ్లిపోయాయి అంటే.. చివరికి తామే షరతులు పెట్టేసి అవి కోర్టు పెట్టిందంటూ ప్రచారం చేసే వరకూ వెళ్లిపోయారు. వైసీపీని.. జగన్ రెడ్డిని నమ్మే వాళ్లను ఓ మాదిరిగా కూడా చూడని ఈ నీలి, కూలి మీడియా.. కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా అదే ప్రచారం చేసింది.
తమను నమ్మే వాళ్లను బకరాలను చేసింది. చివరికి అవే షరతులు విధించాలంటూ సీఐడీ ఏకంగా కోర్టులోనే పిటిషన్ దాఖలు చేసింది. మెడికల్ గ్రౌండ్స్ మీద బెయిల్ ఇచ్చారు కాబట్టి … చికిత్స కోసమే బెయిల్ ఉపయోగించాలని.. రాజకీయ కార్యక్రమాలు చేపట్టకూడదని.. మీడియాతో మాట్లాడుకూడదని.. ఇద్దరు డీఎస్పీలను కాపలా పెట్టాలని ఇలా వింత వింత ఆంక్షలు పెట్టాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏ ఆంక్షలు పెట్టాలో కోర్టు డిసైడ్ చేసుకుంటుంది.. సీఐడీకి ఎందుకు అంత కంగారు అన్నది న్యాయనిపుణుల్ని ఆశ్చర్య పరిచింది.
చంద్రబాబును పూర్తిగా రాజకీయంగా కట్టడి చేయడం కోసమే కేసుల మీద కేసులు పెట్టి జైల్లలో పెట్టి.. పిటిషన్లు విచారణకు రాకుండా పదే పదే వాయిదాలు.. అడుగుతూ వస్తున్నారు. ఇప్పుడు సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ చూస్తే అదే నిజమనిపిస్తుంది. చంద్రబాబు రాజకీయ కార్యక్రమాలు చేపడితే సీఐడీకి ఏంటో నష్టం . సీఐడీ పూర్తిగా ప్రభత్వానికి విపక్ష పార్టీలను కట్టడి చేయడానికి ఓ అస్త్రంగా మారిందని తాజా పిటిషన్‌తో స్పష్టమవుతోంది.
నీలి, కూలి మీడియా కోర్టు తీర్పులను కూడా తామే చెప్పేసేలా హడావుడి చేస్తున్నారు. అలాంటి ఆంక్షలు పెడతరాని ముందుగా ఏమైనా సమాచారం వచ్చిందేమో కానీ .. ప్రచారం చేసేశారు. తీర్పులో అవేమీ లేకపోవడంతో .. కంగుతున్నారు. పరువు పోగొట్టుకున్నారు.