రాజకీయాలు మరీ ముఖ్యంగా ఎన్నికలు మార్కెటింగ్ వ్యూహంగా మారిపోయిన కాలమిది. ముందస్తు ఎన్నికలు వస్తాయో లేదో తెలియదు గాని బిజెపి అద్యక్షుడు అమిత్ షా మాత్రం హర్యానాలోని జిండ్ నుంచి ఫిబ్రవరిలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారట.తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే ఎన్నికల జ్వరం ప్రవేశించింది. వైసీపీ నాయకుడు జగన్ గతంలో మోడీ తదితరులకు ప్రచాకర్తగా పనిచేసిన ప్రశాంత కిశోర్‌ను నియమించుకున్నారు.చాలా విషయాలు పికె సలహాతోనే నడుస్తున్నాయని సమాచారం. అయితే తెలుగు దేశం కూడా ఒక మీడియా సంస్థనే నియమించకున్న సంగతి చాలామందికి తెలియదు. బెంగుళూరుకు చెందిన గ్రూప్ ఎం అనే అంతర్జాతీయ సంస్థను చంద్రబాబు ప్రభుత్వం యాడ్స్ విడుదల కోసం నియమించింది.ఏ పత్రికకు ఏ ఛానల్ఖు ఏ యాడ్స్ ఇవ్వాలనేది వీరే నిర్ణయిస్తారు. అయితే వాస్తవానికి ఈ సంస్థనే రాజకీయంగానూ తెలుగుదేశం ప్రచారానికి సలహాదారుగా వాడుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో వారికి ఒక టేబుల్ వేసి పని చేసుకునే పరిస్థితి కల్పించారు. పికెకు వంద కోట్లు కాంట్రాక్టు కాగా అనుభవాన్ని బట్టి వీరికి ఇంకా ఎక్కువే ఇవ్వాల్సి వుంటుందని భావిస్తున్నారు. గతంలో తెలుగుదేశం ఒక యాడ్ ఏజన్సీని పెట్టుకుని మాలాటి వారందరినీ సంప్రదించేందుకు పంపింది. అప్పుడు చెప్పిన కొన్ని మాటలు వారు ప్రచారంలో ఎలా వాడుకున్నారో కూడాచూడగలిగాను. మరి ఇప్పుడు ఎలా జరుగుతుందో వేచి చూడాల్సిందే.