తెలుగులో నీలి, కూలి మీడియా వ్యవహారం రాను రాను సంచలనంగా మారుతోంది. ఎంతగా అంటే చివరికి సుప్రీంకోర్టు తీర్పులనూ పూర్తిగా రివర్స్ లో ప్రచారం చేసేంత. సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత న్యాయవ్యవస్థ. ఏమి చెప్పిందో అర్థం చేసుకుని రాయడం కనీస బాధ్యత. కానీ తప్పుడు ప్రచారాలు చేయడం.. తమ బాస్ కు బానిసత్వం చేయాలంటే… ఆయనకు నచ్చిన వార్తలు ప్రసారం చేయాలన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు. గతంలోనూ జరిగింది. తాజాగా జరిగింది. ఇది నిరంతర ప్రక్రియగా సాగుతూండటమే అసలు బరితెగింపునకు కారణం.
చంద్రబాబు రాజకీయ సభల్లో పాల్గొనకూడదని గతంలో హైకోర్టు పెట్టిన షరతును తీసేస్తున్నట్లుగా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. కానీ నీలి, కూలి మీడియాలు మాత్రం చంద్రబాబు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకుండా సుప్రీంకోర్టు ఆంక్షలు విధించిందని ప్రచారం ప్రారంభించారు. కనీసం గంట పాటు ఈ ప్రచారం జరిగింది. నిజంగా హడావుడిలో తప్పుు చేసి ఉంటే… ఓ రెండు, మూడు నిమిషాల్లో తప్పు దిద్దుకుంటారు.కానీ గంట పాటు అలాంటి ప్రచారం చేశారంటే ఉద్దేశపూర్వకమేనని చెప్పక తప్పుదు. సుప్రీంకోర్టు ఉత్తర్వులపైనా ఎందుకిలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇస్తున్నారు ?. వారేమి కోరుకుంటున్నారు ?
వైసీపీ అభిమానులు, జగన్ రెడ్డి ఫ్యాన్స్ నీలి, కూలి మీడియాలను నమ్ముతూ ఉంటారు. వారిని ఎప్పటికప్పుడు అందరూ బకరాల్ని చేస్తున్నారు. నిజాలు తెలియకుండా తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారు. వారిని ఓ మాదిరిగా కూడా చూడటం లేదు. ఇలాంటి మీడియాలతో అసలు ఏ చానల్ నిజం చెబుతుందో తెలియని పరిస్థితి మీడియా వెళ్లిపోతోంది. కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్న నీలి, కూలి మీడియా వ్యవహారశైలి రాను రాను వెగటు పుట్టిస్తోంది.