సాక్షి మీడియా సీఈవోను మార్చేశారు. తెలుగు రాకపోయినా గొప్ప మేనేజర్ అనో లేకపోతే… ఇతర మీడియా గ్రూపులతో ఉన్న ఆర్థిక సంబంధాల కారణంగానో కానీ వినయ్ మహేశ్వరి అనే ఉత్తరాది వ్యక్తికి మూడేళ్ల కిందట సీఈవో పోస్ట్ ఇచ్చారు. అప్పట్నుంచి ఆయన చేతుల మీదుగానే వ్యాపార వ్యవహారాల నడుస్తున్నాయి. అయితే హఠాత్తుగా ఆయనను సీఈవో పదవి నుంచే.. కాదు మొత్తంగా ఉద్యోగం నుంచి తప్పించి నార్త్కుపంపేసినట్లుగా తెలుస్తోంది. ఆయన స్థానంలో జగన్ కుటుంబానికి సన్నిహితుడైన సనత్ రెడ్డి అనే ఆడిటర్ను సీఈవోను చేశారు.
వినయ్ మహేశ్వరి సీఈవోగా బాధ్యతలు తీసుకునేటపప్పుడు ప్రింట్కు సవాళ్లు లేవు. ఆయన దైనిక్ భాస్కర్ గ్రూపు నుంచి వచ్చారు. కానీ కరోనా దెబ్బకు మొత్తం అతలాకుతలం అయిపోయింది. సాక్షి లాంటి పత్రికలు ఆర్థికంగా బయటపడటం కష్టంగా మారింది. అదే సమయంలో అధికారం అందడంతో నిలబడ్డారు కానీ.. సాక్షికి ఉన్న ఖర్చులు..ఇతర ఆర్థిక పరిస్థితులతో పోలిస్తే కొలాప్స్ అయిపోయి ఉండేదన్న అభిప్రాయం ఉంది. దీన్ని మెరుగుపర్చడానికి వినయ్ మహేశ్వరి ఏమీ చేయలేకపోయారని.. సాక్షి ని కొత్త తరం మీడియా వైపు మళ్లించడంలోనూ ఆయన పెద్దగా చొరవ చూపలేకపోయారన్న అసంతృప్తితో బయటకు పంపేసినట్లుగా తెలుస్తోంది.
ఇప్పుడు సన్నిహితులైన ఆడిటర్నే సీఈవోగా నియమించారు. దీంతో ఇప్పుడు సాక్షిఆర్థికంగా కుదుటపడే లెక్కలకు ఇబ్బందికరం ఉండదని భావిస్తున్నారు. కొత్త సీఈవో పత్రికను నాలుగు జోన్లుగా విభజించి నలుగురు మేనేజర్లను పెట్టుకుని పనులు చక్కబెట్టాలనుకుంటున్నారు. ఈ మేరకు నియామకాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.