రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నారు మహేష్ బాబు. ఇప్పుడు ఆయన దృష్టి అంతా దానిపైనే వుంది. మహేష్ బాబు వాయిస్ ఇచ్చిన ‘ముఫాసా’ అనే యానిమల్ సినిమా ఈ వారం వస్తోంది. కనీసం ఆ సినిమా కోసం ఓ వీడియో బైట్ ని ఇవ్వలేదు మహేష్. ఎదో పోస్టర్ లాంచ్ వుంటే నమ్రత వెళ్లారు కానీ మహేష్ మాత్రం తన లుక్ ని బయటికి చూపించలేదు. అంత జాగ్రత్తగా తన సినిమా పనిలో వున్నారు.
అలాంటి మహేష్ బాబు మీద ఇప్పుడో న్యూస్ ఛానల్ వింత ప్రచారం చేస్తోంది. మహేష్ బాబు అభిమానులని ఆయన పీఆర్ టీం వైసీపీ వైపు మళ్ళిస్తుందని ఆ న్యూస్ ఛానల్ ఆరోపణ. దీనికి సంబధించిన ఆధారాలు వారి దగ్గర ఏమి ఉన్నాయో గానీ ప్రముఖ న్యూస్ ఛానల్ ఎక్స్ హ్యాండిల్ లో ఈ వార్త రావడం మహేష్ బాబు ఫ్యాన్స్ కే విస్మయానికి గురి చేసింది.
ఈ పోస్ట్ ని ప్రచురించి ఆ న్యూస్ ఛానల్ పై మహేష్ అభిమానులు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. రీచ్ కోసం మహేష్ పేరుని వాడుకోవడం దారుణం అంటున్నారు. రాజకీయాలతో సంబంధం లేని మహేష్, ఆయన ఫ్యాన్స్ ని ఇందులోకి ఎందుకు లాగుతున్నారని ప్రశ్నిస్తున్నారు. పీఆర్ అనే ట్యాగ్ తగిలించి మహేష్ ఫ్యాన్స్ పై అలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదని హితవు పలుకుతున్నారు.
నిజానికి మహేష్ బాబు దగ్గర అఫీషియల్ పీఆర్ టీం లేదు. బిఏ రాజు వున్నప్పుడు మహేష్ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకునేవారు. ఆయన తర్వాత అఫీషియల్ గా ఎవరినీ పెట్టుకోలేదు మహేష్. ఆయన సినిమా చేసినప్పుడు ఆ నిర్మాత నుంచి వచ్చిన పీఆర్ టీమే సినిమా పూర్తయిన వరకు ఏమైనా అఫీషియల్ అప్డేట్స్ ఇస్తుంది. మహేష్ పేరు చెప్పుకొని పీఆర్ అని చెలామణీ అవుతుంటే అది ఆయనకి సంబంధం లేదు.
కొన్ని రోజులు క్రితం ఓ పత్రిక ఎడిటర్ కం జర్నలిస్టు మెగా పీఆర్వో అనే ట్యాగ్ తో చెలామణి అయ్యేవారు. ఆ ట్యాగ్ తోనే ఓ పెద్ద ఈవెంట్ చేసి అట్టర్ ఫ్లాఫ్ అయ్యారు. ఆయన వైఫల్యం మెగా ట్యాగ్ కి కూడా చుట్టుకుంది. దీంతో అల్లు అరవింద్ మాకు ఎవరూ పీఆర్వోలు లేరని క్లారిటీ ఇచ్చారు. అక్కడితో ఆ వ్యవహారం ఆగింది. ఇప్పుడు కూడా మహేష్ పీఆర్ టీం అంటూ హడావిడి జరుగుతుంది. దీనికి మహేష్ వైపు నుంచి చెక్ పడుతుందో లేదో చూడాలి.