టీవీ9లో రజనీకాంత్ అనే వ్యక్తి ముఖం మాత్రం కనిపించడం లేదు కానీ.. కంటెంట్ లో ఏ మార్పూ లేదు. సాక్షి 2 అని టీడీపీ నేతలు ముద్రవేశారు. సాక్షి కన్నా ఎక్కువగా జగన్ కోసం కష్టపడింది. జగన్ కోసం ప్రతిపక్ష నేతలపై ఎంత బురద పూయాలో అంతా పూసింది. చివరికి ఫేక్ ఆడియోలు కూడా టెలికాస్ట్ చేసి.. ఇది సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్నాయని చెప్పునేంత స్థాయికి దిగజారింది. కానీ జగన్ రెడ్డి పాతాళంలోకి పడిపోయాక.. కూటమి నేతలకు డబ్బా కొట్టడం ప్రారంభించింది. అసలు అసలు క్యారెక్టర్ లోపలే ఉందని టీవీ9 కాసేపు చూసిన ఎవరికైనా క్లారిటీ వచ్చేస్తుంది.
టీవీ9లో వైసీపీ ఎజెండాను బలంగా తీసుకెళ్లడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. లడ్డూ ఇష్యూలో నిజాల్ని దాచి పెట్టేందుకు వైసీపీ వాదనకే 80 శాతం సమయం కేటాయిస్తున్నారు. వైసీపీ తరపున మాట్లాడేవాళ్లు పరిమితంగా ఉన్నా సరే ఆ భూమన కరణాకర్ రెడ్డిని, చెవిరెడ్డిని గంటల తరబడి చూపించేందుకు.. వారి మాటలేవో ప్రజాతీర్పులన్నట్లుగా హడావుడి చేస్తున్నారు. తిరుపతిలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేకపోయినా టీవీ నైన్.. జగన్ పై ఏదో దాడులు జరగబోతున్నాయని వైసీపీ ఎజెండాను మోసింది.
నిజాలను చెప్పడానికి టీవీ9 ఇప్పటికీ సిద్ధంగా లేదు. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం పై తప్పుడు అభిప్రాయం కల్పించడానికి మాత్రం డొంక తిరుగుడు వ్యవహారాలను మాత్రం పాటిస్తోంది. టీవీ9 యాజమాన్యం అసలు నిజంగానే మేఘా దగ్గర ఉందా.. అది జగన్ బినామీల చేతుల్లోకి వెళ్లిపోయిందా అన్నది చాలా మందికి వస్తున్న డౌట్