ఆంధ్రజ్యోతి ఆర్కే ఓపెన్ హార్ట్ పేరుతో చేస్తున్న ఇంటర్యూలు గతంలో బాగా ఫేమస్ అయ్యాయి. తాను ఇంటర్యూ చేయాల్సిన స్థాయి ఉన్న వాళ్లు లేరని అనుకోవడంతో గతంలో ఆగిపోయింది. ఇటీవల షర్మిల ఇంటర్యూతో ప్రారంభమయింది. అయితే ఈ సారి గెస్టులు ఓ ధీమ్ ప్రకారం ఉన్నట్లుగా కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో జగన్ బాధితుల్ని మాత్రమే ఆహ్వానిస్తున్నారు. వారితో తమకు ఎదురైన అనుభవాల్ని చెప్పిస్తున్నారు. బాధ్యతగా ఉన్న వాళ్లు పరోక్షంగా అభిప్రాయాలు చెబుతూంటే కొంత మంది నేరుగానే తమను వైసీపీ.., జగన్ ఎలా మోసం చేశారో వివరిస్తున్నారు.
తాజాగా ఆయన మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఇంటర్యూ చేశారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఉన్నప్పటికీ టీడీపీ హయాంలో మంచి ప్రాధాన్యత ఉన్న పోస్టుల్లో పని చేశారు. అయితే ఎన్నికల సమయంలో ఈసీ ఆయనను సీఎస్‌గా నియమించడంతో సీన్ మారిపోయింది . వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. బడ్జెట్ ఆమోదం పొందిన బిల్లులు కూడా ఆపేశారు. నెల్లూరులో ఓ ఆస్పత్రి అవయవాలు అమ్ముకుందన్న ఆరోపణలు వస్తే చర్యలు తీసుకోవాల్సి వచ్చినా తీసుకోలేదు. ఇలాంటివి చాలా ఉన్నాయి. తర్వాత ఆయన సీఎస్ అయ్యారు. అంతే అవమానకరంగా పదవి పోయింది. చివరికి ఆయన రిటైరయ్యాడో లేదో కూడా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆర్కే వెలుగులోకి తీసుకు వచ్చి ఇంటర్యూ చేశారు.
ఆయన తనకు ఎదురైన అనుభవాలు.. ఇతర విషయాలు పరోక్షంగానే చెప్పారు. వీలైనంత వరకూ అక్కడ పాలన అనేది జరగడం లేదని.. అన్నీ నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని చెప్పడంలో సక్సెస్ అయ్యారు. అంతకు ముందు ఆర్కే ఫృధ్వీని తీసుకొచ్చారు. ఫృధ్వీకి ఆ రేంజ్ ఉందని ఆర్కేకి ఎప్పుడు అనిపించింది అంటే.. కేవలం వైసీపీ అధినేతపై విమర్శలు చేసే ధైర్యం ఉందని అనుకున్నతర్వాతనే. దానికి తగ్గట్లుగా ఫృధ్వీని మాట్లాడేలాచేయగలిగారు. జగన్‌కు ఎన్నికలకు ముందు విపరీతంగా సాయం చేసి.. ఆ తరవతా ఆదరణ లేకుండా పోయిన ప్రముఖులు పదుల సంఖ్యలో ఉన్నారు. రానున్న వారాల్లో వాళ్లలో ముఖ్య మైన బాధితుల్ని పిలిపించి… ఇంటర్యూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.