మీనాక్షి చౌదరి కి ఈ నవంబర్ వెరీ స్పెషల్. లక్కీ భాస్కర్ తో హిట్టు కొట్టింది. మట్కా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. మరో రెండు రోజుల్లో ఆమె నుంచి మూడో సినిమాగా మెకానిక్ రాకీ వస్తోంది. ఇలా ఒక్కనెలలోనే మూడు సినిమాలు రావడం స్పెషలే. అయితే సినిమాలతో పాటు ఆమె పెళ్లి వార్త కూడా ఈ నెలలోనే తెగ వైరల్ అయ్యింది. ప్రముఖ సినీ కుటుంబానికి ఆమె కోడలుగా వెళ్ళబోతోందని ఓ గాసిప్ వైరల్ అయ్యింది. ఈ గాసిప్ పై క్లారిటీ ఇచ్చింది మీనాక్షి.
”నేను పెళ్లి చేసుకోవడం లేదు. నేనొక తమిళ యాక్టర్ కొడుకుని పెళ్లి చేసుకుంటున్నాని ఓ రూమర్ వచ్చింది. ఇది పచ్చి అబద్ధం. ప్రతి నెల నా గురించి ఏదో ఓ రూమర్ వస్తోంది. ఈ రూమర్స్ ఎలా వస్తున్నాయో తెలీదు. ఏదైనా వుంటే నేనే అనౌన్స్ చేస్తాను. ప్రస్తుతానికి ఐయాం సింగిల్. నాట్ రెడీ టు మింగిల్’ అని నవ్వేసింది మీనాక్షి. విశ్వక్ సేన్ తో ఆమె జోడి కట్టిన మెకానిక్ రాకీ చిత్రం శుక్రవారం ప్రేక్షకులు ముందుకు వస్తోంది.