మీరా జాస్మిన్ గుర్తుంది కదా? కొన్ని సూపర్ హిట్ చిత్రాల్లో తను కథానాయిక. పవన్ కల్యాణ్, బాలకృష్ణ, రవితేజ లాంటి స్టార్ల సరసన నటించింది. ఏ సినిమాలో అయినా పద్ధతైన పాత్రలే చేసింది. కట్టూ, బొట్టులో పద్ధతి చూపించింది. ఆ తరవాత బాగా లావైపోయింది. తన క్రేజ్ కూడా తగ్గింది. ఆ తరువాతి క్రమంలో మీరా జాస్మిన్ స్థానాన్ని నిత్యమీనన్ లాంటి వాళ్లు భర్తీ చేశారు. ఇప్పుడు మీరాని అంతా మర్చిపోయారు.
అయితే సడన్ గా మీరా మళ్లీ దర్శనమిచ్చింది. సోషల్ మీడియాలో మీరా కొత్త లుక్కు వైరల్ అవుతోంది. ఈసారి మీరా పూర్తిగా పద్ధతి మార్చేసింది. నాజూగ్గా తయారైంది. గ్లామరెస్గానూ మారింది. ఎప్పుడూ లేనంతగా హాట్ హాట్ పోజులతో కవ్వింపులకు దిగింది. మీరాని ఇలా చూస్తే.. ఇది మీరా జాస్మినేనా? అనే అనుమానం వచ్చేలా ఉన్నాయి ఆ ఫోజులు. మీరాలో ఇంత మార్పేమిటో? తను సినిమా అవకాశాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తోంది. ఈమధ్య ఓటీటీల ప్రభావంతో మాజీ హీరోయిన్లకు సైతం మంచి పాత్రలు దక్కుతున్నాయి. భారీ పారితోషికాలు దక్కించుకుంటున్నారు. వాళ్ల డిమాండ్ బాగుంది. అందుకే.. మీరా ఇలా రంగంలోకి దిగిపోయిందేమో? మరి ఈ కొత్త ఇన్నింగ్స్ మీరాకి కలిసొస్తుందో లేదో చూడాలి.