కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతామని ఓ వైపు కొంత మంది బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తూంటే అది అంత తేలిక కాదని.. మరో వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే సంకేతాలు పంపుతున్నారు. విదేశీ పర్యటన నుంచి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని నలుగురు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు కలిశారు. వీరిలో సీఎంకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు. పటాన్ చెరు, నర్సాపూర్, జహీరాబాద్ ఎమ్మెల్యేలను తీసుకుని ఆయన రేవంత్ వద్దకు వెళ్లారు.
ఇది మర్యాదపూర్వక భేటీ అని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ తో అంతగా మర్యాదపూర్వక భేటీలు జరపాల్సిన అవసరం ఏముందనేది ఎక్కువగా వచ్చే సందేహం. కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రభుత్వంతో లింకులున్న చాలా వ్యాపారాలున్నాయి. ఇక తాను ఎమ్మెల్యేగా గెలిచినా తన మాట ఎవరూ వినడం లేదని మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు బాధపడిపోతున్నారు. కనీసం సీఎంను కలిస్తే అయినా కాస్తంత పవర్ అధికారులు ఇస్తారేమోనన్న ఉద్దేశంతో రేవంత్ ను కలిసినట్లుగా తెలుస్తోంది.
జిల్లాల వారీగా ఇలా మర్యాదపూర్వక భేటీల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి పిలిపించుకునే అవకాశం ఉంది. ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్న ఆలోచన చేసినా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బేరాలాడినట్లుగా బయటకు వచ్చినా కల్ట్ చూపిస్తామని గతంలోనే రేవంత్ హెచ్చరించారు. ఇప్పుడు దానికి సగ్నల్స్ పంపుతున్నారని అనుకోవచ్చు.