మెగా హీరోలు వివాదాలకు దూరంగా ఉండాలనుకుంటారు. ఏం మాట్లాడితే ఏం ముంచుకొస్తుందో అన్న భయం చాలా మందిలో కనిపిస్తుంది. ఇంత సీనియారిటీ ఉన్న చిరంజీవి సైతం ఏది పడితే అది మాట్లాడడు. కానీ.. నాగబాబు దారి వేరు. ఈమధ్య ఈ మెగా బ్రదర్… సంచలన వ్యాఖ్యలతో వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నాడు. నందమూరి బాలకృష్ణను ఎపిసోడ్ల వారిగా ఆడుకున్న నాగబాబు.. ఇప్పుడు సొంతంగా `మై ఛానల్ నా ఇష్టం` అంటూ యూ ట్యూబ్ ఛానల్‌ని మొదలెట్టాడు. దీని ఉద్దేశం ఒక్కటే… ఇప్పటి వరకూ ఫేస్ బుక్ పోస్ట్‌ల ద్వారా చేసిన సంచలనాలు.. ఇప్పుడు యూ ట్యూబ్ ఛానల్ ద్వారా చేస్తాడంతే.
నాగబాబు ఓపెనింగ్ కూడా అదిరింది. తొలుత బాలయ్య అల్లుడు నారా లోకేష్‌ని టార్గెట్ చేశాడు. లోకేష్ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలని మళ్లీ తిరగదోడాడు. లోకేష్ తరచూ నోరు జారతాడన్న సంగతి అందరికీ తెలుసు. ఓసందర్భంలో టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడి, ఆ తరవాత నాలిక కరచుకున్నాడు. ఇప్పుడు అదే వీడియోని నాగబాబు వైరల్ చేయడం మొదలెట్టాడు. ససలోకేష్ చిన్నపిల్లాడు.. అన్నీ నిజాలే చెప్పాడు. అందుకే అంటారు పిల్లలూ, దేవుడూ చల్లని వారే. కల్ల కపటమెరుగని కరుణామయులే..“ అని సెటైర్ వేశాడు. మొత్తానికి నాగబాబు సొంత కుంపటి మొదలెట్టాడు. చేతిలో యూట్యూబ్ ఛానల్, అందులోని పోస్టుంగుల్ని వైరల్ చేసే అభిమానులు ఉన్నారుగా. ఇక మెగా బ్రదర్.. జబర్దస్త్‌తో పాటు తన ఛానల్ ద్వారానూ వినోదాలు పంచబోతున్నాడన్నమాట.