స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సైరాలో చిత్రంలో నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవిని ఆయన సోదరుడు పవన్ కల్యాణ్ కలిశారు. పవన్‌తో పాటు జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. వారిద్దరూ కలిసి చిరంజీవిని కలిశారు. చాలారోజుల తర్వాత పవన్ తన అన్నయ్యతో భేటీ అయ్యారు. ఈ ఫోటోను నాదెండ్ల మనోహర్ ట్వీటర్లో షేర్ చేయడంతో అభిమానుల మంచి రెస్పాన్స్ వస్తుంది.
“సైరా నర్సింహారెడ్డి (చిరంజీవి)తో పవన్ కల్యాణ్, నేను సమావేశమయ్యాం. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఆయన జీవిత పయనం మాకెంతో స్ఫూర్తి. చిరంజీవి ఆయనకు గొప్ప విజయం దక్కాలని ఆశిస్తున్నాం. ఇలాంటి మరెన్నో సమావేశాల్లో ఆయనతో కలిసి పాల్గొనాలని కోరుకుంటున్నాను” అంటూ నాదెండ్ల ట్వీట్లో పాల్గొన్నారు. ఇక సైరా అక్టోబర్ రెండో తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.