ఓ సినిమా విషయంలో చిరంజీవి చాలా రకాలైన జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కథ దగ్గర్నుంచి, పాటలు, కాస్టింగ్, టైటిల్ ఇలా… అన్ని విషయాల్లోనూ ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆయన రకరకాల వ్యక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ అందుతుంటుంది. అవన్నీ.. చిరు పరిగణిస్తారు కూడా. అందుకే దశాబ్దాలుగా ఆయనే నెంబర్ వన్.
‘ఆచార్య’ టైటిల్ విషయంలో నూ చిరుకి అలాంటి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఈ టైటిల్ అనుకున్న తరవాత.. తన కుటుంబంలోవాళ్లందరి గురించీ ఈ టైటిల్ గురించి చర్చించార్ట. ఇంట్లోవాళ్లందరూ ఏకగ్రీవంగా ఈ టైటిల్ కే ఓటేశార్ట. ఈ విషయాన్ని ఇటీవల చిరు ఓ సందర్భంలో చెప్పారు. ”ఆచార్య లాంటి టైటిళ్లు అదురుగా కుదురుతుంటాయి. ఈ టైటిల్ అయితే మా అమ్మగారికి బాగా నచ్చింది. నా సినిమాల టైటిళ్లపై మా అమ్మగారు ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. తన ఫీడ్ బ్యాక్ నిర్మొహమాటంగా చెబుతారు. రాక్షసుడు, కిరాతకుడు లాంటి టైటిళ్లు మా అమ్మగారికి నచ్చలేదు. నాకు అలాంటి టైటిళ్లు సూటవ్వవని ఆమె అభిప్రాయం. కథ ప్రకారం అలా పెట్టాల్సివచ్చింది. ఆచార్య అయితే.. ఆమెకు బాగా నచ్చిన టైటిల్” అని చిరు చెప్పుకొచ్చారు. మరి గాడ్ ఫాదర్ పై కూడా ఆయన ఒపీనియన్ తీసుకున్నారో లేదో?!