ఈమధ్య ఏ హీరోయిన్ ఎంట్రీ గురించీ ఇంత చర్చ జరగలేదేమో? ఈమధ్యేంటి… అసలు మన ఇండ్రస్ట్రీలో ఓ కొత్త హీరోయిన్ వస్తోందంటే ఎవ్వరూ ప్రత్యేకంగా ఆసక్తి చూపించరు. అయితే.. నిహారిక ఎంట్రీ అలాంటి సాదా సీదా ఎంట్రీకాదు. ఆమె వెనుక మెగా ఫ్యాన్స్ బలం ఉంది. వాళ్లంతా… నిహారిక గురించి ఆసక్తిగా ఎదురుచూశారు. రామరాజులాంటి దర్శకుడు, ఓ ఫీల్ గుడ్ మూవీ… అందులో నిహారిక ఇలా ఊహించుకొంటూ ఊహించుకొంటూ ఆశలు ఆకాశాన్ని తాకాయి. టాప్‌హీరోయిన్లకు నిహారిక సవాల్ విసరడం ఖాయం అనుకొన్నారు. తీరా ఒక మనసు చూశాక.. వాళ్ల మనసులన్నీ దిగాలైపోయాయి. సినిమా పరమ బోరింగ్‌గా ఉండడం ఒక ఎత్తయితే.. నిహారిక పెర్‌ఫార్మ్సెన్స్, తన లుక్స్, వేసుకొన్న కాస్ట్యూమ్స్ ఇవన్నీ అభిమానుల్ని తీవ్రంగా నిరాశ పరిచాయి.
సెకనుకో చీర మార్చుకొచ్చిన నిహా… ఏ డ్రస్సులోనూ అందంగా కనిపించలేదన్నది టాక్. అయితే ఆ డ్రస్సులన్నీ నిహారిక మమ్మీనే స్వయంగా సెలెక్ట్ చేసిందట. ఈ విషయంలో దర్శకుడి ప్రమేయం ఏమీ లేదని టాక్. నటనలో నాగశౌర్యని మించిపోతుందని ఊహించివాళ్లు కూడా… బాగా షాక్ కి గురయ్యారు. ఎందుకంటే నాగశౌర్య ఇది వరకటి సినిమాలకంటే బాగా నటించాడన్న పేరుతెచ్చుకొన్నాడు. శౌర్య నటన ముందు నిహారిక ఎక్స్ప్రెషన్స్ కూడా తేలిపోయాయి. ఇదే తొలి సినిమా కాబట్టి… మెగా ఇంటి నుంచి వచ్చిన హీరోలు దాదాపుగా తొలి సినిమాలో తడబడడం అలవాటుగా చేసుకొన్నారు కాబట్టి.. సర్దుకుపోవొచ్చు. రెండో సినిమాలోనూ సేమ్ పెర్ఫార్మ్సెన్స్చూపిస్తే మాత్రం కష్టమే.