అదిగో పులి అని మొదటి సారి అరిస్తేఎవరైనా అలర్ట్ అవుతారేమో కానీ.. అది అబద్దమని తెలిసినా పదే పదే అరిస్తే ఎవరు మాత్రం పట్టించుకుంటారు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ పరిస్థితి అదే. ఆయన అల్లునే మెగా అంటూ ఓ ట్వీట్ కొత్త వివాదానికి తెర తీశాను.. ఇక మెగా ఫ్యామిలీలో రెండు వర్గాలు అయిపోతాయని ఆయన ఫీలయ్యాడు. కానీ ఆయన ట్వీట్ గురించి పట్టించుకునే తీరిక ఎవరికీ లేకుండా పోయింది.
హిందీలో అల్లు అర్జున్ పుష్పకు మంచి రెస్పాన్స్ వచ్చింది. హిందీ సినిమాలకు మించి కలెక్షన్లు వచ్చాయి. దీన్ని చూసే ఇలా ఆర్జీవీ డిక్లేర్ చేసి… కొత్త పంచాయతీ పెట్టాలనుకున్నారు. కానీ ఆర్జీవీ గురించి అందరికీ తెలుసు కాబట్టి ఆ గేమ్‌లో భాగం అయ్యేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. రేపు ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయితే.. వెయ్యి కోట్లు వసూలు చేస్తుంది. అప్పుడు ఆర్జీవీ ఏమంటారో కానీ.. అలాంటి అవకాశం కోసం ఎదురు చూడకుండా ముందుగానే ఓ ట్వీట్ పెట్టి పంచాయతీ చూద్దామనుకున్నారు.
గతంలోనూ ఇలాంటి అతి తెలివి తేటల్ని ఆర్జీవీ ప్రయోగించి… తను వార్తల్లో ఉండాలనుకున్నారు. కానీ మెగా క్యాప్ వ్యూహాత్మకంగా వ్యవహరించి… ఇగ్నోర్ చేసింది. ఇప్పుడు కూడా అలాగే చేస్తోంది. ఆర్జీవీ లాంటి వారు టైంపాస్.. చేసి కాస్త పబ్లిసిటీ కోసం ఇలాంటి పనులు చేస్తూంటారు.. అలాంటి వారి ట్రాప్‌లో పడటం దండగని మెగా ఫ్యాన్స్ గుర్తించిటన్లుగా ఉన్నారు.