చిరంజీవిది. తనది భిన్నమైన వ్యక్తిత్వాలని అర్థం చేసుకోలేకపోతే అపార్థాలకు కారణం అవుతుందని… జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులకు తెలిపారు. చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది కాబట్టే… పవన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయలేదన్నారు. చిరంజీవి ఫ్యాన్స్ అందరిని తాను జనసేన పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. రాజ్యసభ సభ్యత్వం ముగిసిన తర్వాత చిరంజీవి రాజకీయాలకు దూరమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిరంజీవి ఫ్యాన్స్ అంతా.. ప్రత్యేకంగా హైదరాబాద్ లో ఓ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిపోయారు.
చిరంజీవి ఫ్యాన్స్ అందరినీ.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్‌కల్యాణ్. అఖిలభారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామి నాయుడు, ఏపీ చిరంజీవి యువత అధ్యక్షుడు కటకం రామకృష్ణ, తెలంగాణ అధ్యక్షుడు నందకిశోర్, కర్ణాటక చిరంజీవి యువత అధ్యక్షుడు జనసేనలో చేరిన వారిలో ఉన్నారు. జనసేన పార్టీ ఏడు సిద్ధాంతాలను అభిమానులు అందరూ పాటించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. చిరంజీవి అభిమానులు జనసేన పార్టీలోకి రావటం శుభపరిణామం అని ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించిన జనసేన పధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ అన్నారు. పీఆర్పీలో పని చేసిన తోట చంద్రశేఖర్ తర్వాత వైసీపీలో చేరారు. ఇటీవలే జనసేనలో చేరి ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టారు. ప్రజారాజ్యం సమయంలో చిరు, పవన్ అభిమానులు చాలా శ్రమించారు, దురదృష్ణవశాత్తు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయామని.. ఇఈ సారి మాత్రం.. లక్ష్యాన్ని సాధించాలని చంద్రశేఖర్ అభిమానులకు పిలుపునిచ్చారు.
చిరంజీవి రాజకీయంగా సైలెంటయిపోయిన తర్వాత.. పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. అప్పుడే..జనసేనకు అనుకూలగా చిరంజీవి ఫ్యాన్స్ మారిపోయారు. ఇప్పుడు కొత్తగా వారిని పార్టీలో చేర్చుకునే కార్యక్రమం ఏమిటో కొంత మంది అర్థం కాలేదు. కానీ.. చిరంజీవి సాంకేతికంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన మద్దతు తమ్ముడికి లేదని జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్డడానికే.. నాగబాబు.. చొరవ తీసుకుని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. అందుకే.. ఇక చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రారని రెండు రోజుల కిందటే.. ఓ ఇంగ్లిష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పారు. ఇప్పుడీ కార్యక్రమంతో.. మెగా ఫ్యామిలీ మొత్తం జనసేన వైపే ఉందన్న భావన అభిమానుల్లోకి పంపే ప్రయత్నం చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
హైదరాబాద్ లో ఫ్యాన్స్ చేరిక కార్యక్రమానికి.. సినిమా ఫంక్షన్ కు పంపినట్లు పాసులు పంపారు. వచ్చిన వారిలో చాలా మంది.. అత్యుత్సాహ్సానికి పోవడం.. వేదికపైకి పెద్ద సంఖ్యలో చేరడంతో .. కార్యక్రమం మొత్తం గందరగోళంగా సాగింది. బౌన్సర్లు, అభిమానులకు తోపులాట చోటు చేసుకుంది. క్రమశిక్షణ పాటించాలని పవన్ కల్యాణ్ పదే పదే విజ్ఞప్తి చేసినా ఎవరూ పట్టించుకోలేదు.