మెగా ఫ్యామిలీతో తమన్‌కి మంచి ఎటాచ్ మెంటే ఉంది. చరణ్, బన్నీ, సాయిధరమ్ తేజ్‌ల సినిమాలకు పనిచేశాడు. చిరు గెస్ట్ రోల్లో రీ ఎంట్రీ ఇచ్చిన బ్రూస్లీలోనూ చిరు కోసం అదిరిపోయే ఆర్ ఆర్ ఇచ్చాడు. ఆ బిట్‌ని చిరు ఫ్యాన్స్ తెగ వాడుకొన్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు కోసం కట్ చేసిన ప్రోమోకూ.. తమనే సంగీతం అందించాడు. ఖైది నెం.150 సినిమా కోసం తమన్ పేరు గట్టిగానే ప్రచారం జరిగింది. అయితే ఆ తరవాత ఆ ఛాన్స్ దేవిశ్రీ ప్రసాద్‌ని వరించింది. ఉయ్యాల వాడ నరసింహారెడ్డికి సంగీతం అందించే ఛాన్స్ కూడా తమన్‌కి తృటిలో తప్పిపోయింది. చిరు పుట్టిన రోజు సందర్భంగా సైరా మోషన్ పోస్టర్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. దానికి ఆర్.ఆర్ ఇచ్చింది కూడా తమనే. అయితే స్వరాలు సమకూర్చే బాధ్యతలు మాత్రం రెహమాన్‌కి అప్పగించారు. సైరాని ఆల్ ఇండియా లెవిల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేద్దామన్నది చిత్రబృందం ఆలోచన. ఈ సినిమాని బాలీవుడ్లో మార్కెట్ చేసుకోవాలంటే రెహమాన్ లాంటి సంగీత దర్శకుల పేర్లు టీమ్‌లో ఉండాల్సిందే. అందుకే తమన్‌ని పక్కన పెట్టాల్సివచ్చింది. అయితే.. తమన్ మాత్రం మెగా అభిమానుల మనసుల్ని గెలుచుకొనాడు. మోషన్ పోస్టర్‌కి తన ఆర్.ఆర్తో ఊపు తెచ్చిన తమన్‌కి మెగాఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అవసరానికి అక్కరకు వచ్చిన తమన్ ని చిరు తప్పకుండా గుర్తిస్తాడన్నది మెగా అభిమానుల నమ్మకం. చిరు 152 టీమ్‌లో తమన్ పేరు కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు.