ఆచార్యతో మెగా ఫ్యాన్స్ అంతా నీరుగారిపోయారు. ఆ డిజాస్టర్ నుంచి ఇంకా కోలుకోలేదు. ఇప్పుడు చిరు సినిమా ఏదోటి వచ్చి, హిట్టు కొట్టేంత వరకూ ఈ దిగులు ఉండనే ఉంటుంది. అయితే… ఇప్పుడు వాళ్లందరినీ ఓ బ్యాడ్ సెంటిమెంట్ భయపెడుతోంది. అదే.. బివిఎస్ రవి.
బివిఎస్ రవి చాలా స్క్రిప్టుల్లో తను కూడా ఓ చేయి వేస్తుంటాడు. అయితే… అలా చేయి వేసిన సినిమాలు ఈ మధ్య సరిగా ఆడడం లేదు. దానికి `థ్యాంక్యూ` ఓ పెద్ద ఉదాహరణ. ఈసినిమాకి కథ కూడా ఆయనే అందించాడు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇది వరకు కూడా బివిఎస్ రవి పని చేసిన సినిమాలేవీ ఆడలేదు. ఆయన దర్శకుడిగానూ ఫ్లాపే. ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న `భోళా శంకర్`, `వాల్తేరు వీరయ్య` చిత్రాలకు సైతం బివిఎస్ రవి స్క్రిప్టులో కూర్చున్నాడట. ఈ విషయం తెలిసి మెగా ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. చిరు హిట్టు కొట్టాల్సిన దశలో.. ఈ బ్యాడ్ సెంటిమెంట్ ఏమిటో? అంటూ కలవరపడుతున్నారు. అందులోనూ ముందు నుంచీ మెహర్ రమేష్ పై ఎవ్వరికీ ఆశల్లేవు. ఇప్పుడీ బ్యాడ్ సెంటిమెంట్ కూడా చేరిపోయింది. అయితే వీటన్నింటికంటే ముందు `గాడ్ ఫాదర్` వస్తోంది. ఇది కూడా రీమేకే. అయినప్పటికీ.. ఇందులో ఉన్న స్టార్ హంగామా కాస్త ఊరట ఇచ్చే అంశం. పైగా.. రీమేక్ అనగానే సేఫ్ జోనర్. కాబట్టి.. ముందు గాడ్ ఫాదర్ వచ్చి, హిట్టు కొడితే, ఫ్యాన్స్ కాస్త ఊరిపి తీసుకుంటారు.