తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి మామూలోడు కాదు. తెలుగు పొలిటీషియన్స్ అందరిలోకి అత్యంత ఎక్కువగా భజన చేయగల సామర్థ్యం టీఎస్సార్ సొంతం. వినేవాళ్ళకు ఆయన మాటలు కామెడీగా ఉన్నా భజన చేయించుకుంటున్నవాళ్ళకు మాత్రం మహాద్భుతంగా ఉంటాయి. అందుకే కాంగ్రెస్ వారి అధిష్ఠాన దేవత సోనియమ్మ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న పొలిటికల్, సినిమా సెలబ్రిటీస్ అందరిలోనూ టీఎస్సార్కి మంచి పేరుంది. అలాగే భజన చేయించుకోవడంలో కూడా టీఎస్సార్ తర్వాతే ఎవరైనా. గతంలో కవుల చేత పొగిడించుకోవడానికి రాజులు ఖర్చుపెట్టిన స్థాయిలో కాకపోయినా….పొగడ్తల కోసం కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టడం టిఎస్సార్ లైఫ్ స్టైల్.
అప్పుడెప్పుడో ఫ్లాష్ బ్యాక్‌లో సినిమాలు నిర్మించిన టిఎస్సార్….ఇప్పుడు సడన్‌గా ఖైదీ నంబర్ 150 సిినిమా ఫంక్షన్స్‌లో ప్రొడ్యూసర్‌గా రీ ఎంట్రీ ఇస్తున్న విషయాన్ని రివీల్ చేశాడు. దేశంలో డిజాస్టర్ల అమ్మ మొగుడు లాంటి ఫలితాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘అంతకు మించి’ అనే స్థాయి రిజల్ట్‌ని ఫేస్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో కోలుకునే ఛాన్సే లేదు. అందుకే కాంగ్రెస్ నాయకులందరూ వేరే పార్టీల్లో చేరిపోతున్నారు. సీన్‌లేని సీనియర్ నాయకులేమో టైం పాస్ వ్యాపకాలు చూసుకుంటున్నారు. 150వ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడో ఏమో కానీ ఇప్పుడు ఈ తిక్కవరపు సుబ్బిరామిరెడ్డిగారు కూడా సినిమా ప్రొడ్యూసర్‌గా రీ ఎంట్రీ ఇవ్వాలని తెగ ఆరాటపడిపోతున్నాడు. ఆయన ఇస్తున్న స్టేట్మెంట్స్ దెబ్బకు మెగా హీరోలు చిరంజీవి, పవన్ ఫ్యాన్స్‌తో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా కన్ఫ్యూషన్లో పడిపోయారు. బోలెడన్ని గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. పవన్‌తో చేయడానికి రెడీ అవుతున్న సినిమా పూర్తవ్వగానే ఎన్టీఆర్‌తో సినిమాకి త్రివిక్రమ్ రెడీ అవుతాడని ఇప్పటివరకూ అందరూ అనుకుంటున్నారు. కానీ సుబ్బిరామిరెడ్డి ఇస్తున్న షాకింగ్ న్యూస్‌లతో త్రివిక్రమ్ నెక్ట్స్ చేయబోయే సినిమాల గురించి పిచ్చ కన్ఫ్యూషన్ వచ్చేసింది. మామూలుగా అయితే తన స్నేహితుడు పవన్ కళ్యాణ్లాగే కాస్తంత సైలెంట్‌గా వ్యవహారాలు నడిపించే స్టైల్ త్రివిక్రమ్‌ది. కానీ ఇప్పుడు మాత్రం ఆయన స్పందించాల్సిన అవసరం కనిపిస్తోంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరినీ కన్ఫ్యూషన్లో పడేయడం అంటే మాటలా? తెలుగు సినిమా లవర్స్‌లో ఎక్కువ మందికి డిస్కషన్ పాయింట్ అయినట్టే. ఈ విషయంపైన రకరకాల ఊహాగానాలు హల్చల్ చేయకముందే త్రివిక్రమ్ స్పందిస్తే బాగుంటుందేమో.