హైదరాబాద్: నటుడు, రాజ్యసభ ఎంపీ చిరంజీవికి ఇవాళ ముంబాయి బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఆపరేషన్ జరుగనుంది. చాలాకాలంనుంచి బాధపెడుతున్న భుజం నొప్పికిగానూ ఈ ఆపరేషన్ చేయించుకుంటున్నారు చిరు. ఆపరేషన్ తర్వత రెండు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. చిరంజీవి సతీమణి సురేఖ కూడా ఆయన వెంట ఉన్నారు. ఈ ఆపరేషన్ నుంచి కోలుకున్న తర్వాత కత్తి సినిమా రీమేక్ షూటింగ్లో చిరు పాల్గొననున్నారని సమాచారం.
చాలా రోజులనుంచి ఈ ఆపరేషన్ చేయించుకోవాలని చిరంజీవి అనుకుంటున్నారని, కత్తి సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుండటంతో దానికి ముందే ఇది పూర్తి చేయ్యాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుంటున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే వియ్యంకులవారి అపోలో ఆసుపత్రిలాంటి అతి పెద్ద సంస్థ ఇక్కడే ఉండగా, ముంబాయి వెళ్ళి బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేయించుకోవటం ఏమిటో తెలియటంలేదు.