22 ఏళ్ల ‘చూడాల‌నివుంది’.. ఎన్ని మ్యాజిక్కులో?!

చిరంజీవి కెరీర్‌లో… మ‌రో సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమా… `చూడాల‌నివుంది`. అప్ప‌ట్లో ఆల్ టైమ్ ఇండ్ర‌స్ట్రీ రికార్డుల్ని సృష్టించింది. స‌రిగ్గా.. ఈనాటికి ఈ సినిమా విడుద‌లై 22 ఏళ్లు. నిజానికి అస‌లు ఈ సినిమా సెట్ అవ్వ‌డమే ఓ మ్యాజిక్‌. ఇలాంటి చాలా మ్యాజిక్కులు.. `చూడాల‌నివుంది`తో సాధ్యం అయ్యాయి. అవ‌న్నీ ఓసారి గుర్తు చేసుకుంటే..

సొగ‌సు చూడ‌త‌ర‌మా, బాల రామాయ‌ణంలాంటి సినిమాల‌తో అప్పుడ‌ప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్నాడు గుణ శేఖ‌ర్‌. మ‌రోవైపు చిరు అంటే మాస్ ఇమేజ్‌. చిరుకి త‌గిన క‌థ గుణ తీసుకురాగ‌ల‌డా? అస‌లు ఇద్ద‌రి కాంబో సెట్ అవుతుందా? అనే అనుమానాల మ‌ధ్య ఈ సినిమా మొద‌లైంది. నిజానికి… `బాల‌రామాయ‌ణం` చూశాక‌… గుణ శేఖ‌ర్‌పై ఓ ఇంప్రెష‌న్ క‌లిగింది చిరుకి. `గుణ ద‌గ్గ‌ర ఓ క‌థ ఉంంద‌ట‌.. వింటారా?` అంటూ చూచాయిగా ఓ నిర్మాత చిరు చెవిన క‌బురు వేస్తే… `ర‌మ్మ‌నండి.. వింటా` అన్నారు.

చిరు – గుణ‌శేఖ‌ర్ క‌లుసుకోవ‌డం అదే తొలిసారి. తొలి మీటింగులోనే… గుణ చెప్పిన క‌థ‌ని ఓకే చేసేశాడు చిరు. దాంతో.. ఏమాత్రం ఊహించ‌ని కాంబో సెట్ట‌య్యింది. కొల‌కొత్తా నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. సినిమా మొత్తం కొల‌కొత్తా బ్యాక్ డ్రాప్ లో సాగ‌డం.. తెలుగు సినిమాకి సంబంధించినంత వ‌ర‌కూ అదే తొలిసారి. కొల‌కొత్తాలో కొన్ని సీన్లు తెర‌కెక్కించినా, అపార్ట్‌మెంట్ సెట్ మాత్రం హైద‌రాబాద్ లోని అన్న‌పూర్ణ స్టూడియోలోనే వేశారు. అప్ప‌ట్లో అత్యంత ఖ‌రీదైన సెట్ అదే.

సంగీత ప‌రంగా ఈ సినిమా ఆడియో కొత్త పుంత‌లు తొక్కింది. `రామ్మా చిల‌క‌మ్మా` పాటైతే… మార్మోగిపోయింది. ఈ పాట‌ను ఉదిత్ నారాయ‌ణ్ తో పాడించారు. చిరుకి ఉదిత్ గొంతు సెట్ అవ్వ‌ద‌న్న‌ది అంద‌రి న‌మ్మ‌కం. భ‌యం. కానీ.. చిరు మాత్రం లెక్క చేయ‌లేదు. `ఉదిత్ గొంతులో ఇలాంటి పాట కొత్త‌గా ఉంటుంది` అని న‌మ్మారు. ఫ‌లితం తెలిసిందే. ఆ పాట త‌ర‌వాత‌.. ఉదిత్ తెలుగులో బిజీ సింగ‌ర్ అయిపోయాడు.

`య‌మ‌హా న‌గ‌రి.. క‌ల‌క‌త్తా పురి` ఓ క్లాసిక‌ల్ సాంగ్‌. ఇలాంటి పాట చిరు సినిమాలో ఊహించ‌డం క‌ష్టం. పైగా ఇంట్ర‌డ‌క్ష‌న్ పాట‌లా. ఈ పాట‌పై కూడా త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు జ‌రిగాయి. కానీ.. చివ‌రికి అదే ఫైన‌ల్ అయ్యింది. కొల‌కొత్తా రాష్ట్ర గీతంగా వాడుకోద‌గిన పాట‌.. అన్న స్థాయిలో వేటూరి ఈ పాట అద్భుతంగా రాశారు. దాన్ని మ‌ణిశ‌ర్మ స్వ‌ర‌ప‌రిచిన విధానం, హ‌రిహ‌ర‌న్ పాడిన ప‌ద్ధ‌తి.. ఈ పాట‌ని ఎక్క‌డికో తీసుకెళ్లిపోయింది.

టైటిల్ కూడా ఓ మ్యాజిక్కే. చూడాల‌నివుంది.. అన్న‌ది క్లాస్ టైటిల్. చిరులాంటి మాస్ హీరో సినిమాకి ఇదేం టైటిల్ అని.. ముందు పెద‌వి విరిచారు. కానీ.. సినిమా విడుద‌ల‌య్యాక‌.. ఈ టైటిల్ ప్ల‌స్ అయ్యింది. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని మ‌రింత చేరువ చేసింది. ఈ సినిమాతో ప్ర‌కాష్ రాజ్ ప్ర‌ధాన విల‌న్ గా మారిపోయాడు.
ఈ సినిమాకి ముందు ట‌బు – చిరు కాంబోలో ఓ సినిమా మొద‌లై, మ‌ధ్య‌లో ఆగిపోయింది. ఆ సినిమా కోసం తెర‌కెక్కించిన ఓ గీతాన్ని `చూడాల‌నివుంది` విడుద‌లై 50 రోజులు పూర్త‌యిన త‌ర‌వాత క‌లిపారు. దాంతో.. రిపీట్ ఆడియ‌న్స్ తో థియేట‌ర్లు మ‌ళ్లీ కిట‌కిట‌లాడిపోయాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close