తెలుగు రాష్ట్రాల్లో గత అధికార పార్టీలకు అత్యంత ప్రియమైన మేఘా కంపెనీ అక్రమాలను ఆర్టీవీ రవిప్రకాష్ బయటపెట్టారు. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ పేరుతో వారు చేసిన పెద్ద ఫ్రాడ్ ను ఆయన వెలుగులోకి తెచ్చారు. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
మేఘా కంపెనీ అతి భారీ ప్రాజెక్టుల్ని చేపడుతుంది. ఓ రకంగా ప్రభుత్వం అభివృద్ధి పనుల పేరుతో ఖర్చు పెట్టే సొమ్ములో ఎక్కువగా ఈ కంపెనీ ఖాతాలోకే వెళ్తుంది. పనులు చేయకపోయినా వేల కోట్లు బిల్లులు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి కంపెనీ కొన్ని రూల్స్ పాటించడానికి అక్రమాలకు పాల్పడింది. కాంట్రాక్ట్ తీసుకున్న ప్రతి ప్రాజెక్టులోనూ దాని విలువలో పది శాతం బ్యాంక్ గ్యారంటీలు సమర్పించాలి. అలా మేఘా కంపెనీ కూడా బ్యాంకు గ్యారంటీలు సమర్పించింది.
దేశంలో బోలెడన్ని బ్యాంకులుంటే.. మేఘా కంపెనీ మాత్రం యూరో ఎగ్జిమ్ బ్యాంక్ అనే బ్యాంక్ గ్యారంటీలను సమర్పించింది. ఆ బ్యాంకులో మేఘా డిపాజిట్లు చేయలేదు. ఆ బ్యాంకు పెద్ద ఫ్రాడ్. కార్యకలాపాలు ఉండవు. వెస్టిండీస్ దీవుల్లో ఓ చిన్న దీవి అయిన సెయింట్ లూసియాలో ఉంటుంది. ఆ బ్యాంక్ పని.. ఇండియాలో ఇలా తప్పుడు బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చి కమిషన్లు దండుకోవడమే అన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ బ్యాంక్ ప్రతినిధి హైదరాబాద్ లో ఉంటారు. కానీ ఆ బ్యాంక్ బ్రాంచ్ మాత్రం ఇక్కడ లేదు.
బ్యాంక్ గ్యారంటీల వెనుక ఉన్న ఈ బడా స్కామ్ ను రవిప్రకాష్ బయట పెట్టారు. మొత్తంగా రెండున్నర వేల కోట్లు ఉంటుందని ఆయన చెబుతున్నారు. మొత్తం డాక్యుమెంట్లు కూడా ప్రదర్సించారు. ప్రభుత్వాలు దృష్టి పెడితే ఈ అంశం పెను సంచలనం అయ్యే అవకాశం ఉంది.