మేఘా ఇంజనీరింగ్ కంపెనీ గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం చాలా గొప్పగా చెప్పుకుంటారు. కొన్నివేలకోట్ల రూపాయల కాంట్రాక్టులు చేస్తూంటారు.కొన్ని వందల కోట్లు రాజకీయపార్టీలకు విరాళాలిస్తూంటారు. రాజకీయ నేతలకు లంచాలు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే వీరు కూడా మోసపోయారు. అదీ కూడా సైబర్ నేరగాళ్ల చేతుల్లో,
మేఘా కంపెనీ యూరప్ లోని ఓ కంపెనీతో లావాదేవీలు నిర్వహిస్తుంది..ఓ కంపెనీ చేసినసేవలకో.. పంపించిన సామాగ్రికో .. ఐదున్నర కోట్లు డబ్బులు చెల్లించారు. ఓ నెల తర్వాత మళ్లీ అదే కంపెనీ నుంచి డబ్బులేవి అనే మెసెజ్ వచ్చింది. అదేంటి ఇచ్చాం కదా అని ఆరా తీస్తే వారికి షాక్ తగిలినట్లయింది. వీరి ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ నేరస్తులు.. ఆ కంపెనీ పేరుతో ఓ బినామీ బ్యాంక్ అకౌంట్ పంపి….దానికి బదిలీ చేయించున్నారు. క్రాస్ చెక్ చేసుకోవడంలో విఫలం అయిన కంపెనీ సిబ్బంది విషయం బయటపడే సరికి లబోదిబోమన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫ్రాడ్స్టర్లు.. ఇలా లావాదేవీల మెయిల్స్ చూసి.. ఒక్క అక్షరం తేడాతో మెయిల్స్ సృష్టించి కమ్యూనికేట్ చేస్తున్నారు. బ్యాంక్ అకౌంట్లో సమస్యలు ఉన్నాయని.. వేరే బ్యాంక్ అకౌంట్ కు పంపాలని కోరుతున్నారు. నిజమేనని నమ్మితే దొరికినంత ఖాతాల్లో జమ చేయించుకుంటున్నారు.
ఇది అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నేరస్తులు చేసిన పని కావడంతో పోలీసులూ పెద్దగా ఏమీ చేయలేరు.పైగా ఇది జరిగి రెండు నెలలు అయింది. అందుకే పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. యూరప్ సంస్థ తమ డబ్బులు తమకు కట్టాల్సిందేనని డిమాండ్ చేస్తోంది.దీంతో చెల్లించక తప్పలేదు.