ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్‌ను రూ. 800 కోట్లు తక్కువకు దాఖలు చేసి.. అందరి దృష్టిని ఆకర్షించిన మేఘా ఇంజినీరింగ్ కంపెనీ అధినేత కృష్ణారెడ్డి పేరు.. తెలంగాణ ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీలో చురుగ్గా తిరుగుతున్నాయి. అవి అద్దె ప్రాతిపదికన ఉండటంతో.. వాటిపై సమ్మె ప్రభావం లేదు. అదే సమయంలో సీఎం కేసీఆర్.. సగానికి సగం…ఆర్టీసీలో అద్దె బస్సులుంటాయని… ప్రకటించడంతో.. అందరి దృష్టి… మేఘా కృష్ణారెడ్డి వైపే మళ్లింది. ఇప్పటికే ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను తిప్పుతూండటం… ఏపీలోనూ… ఆ కాంట్రాక్ట్ కోసం.. ప్రయత్నాలు చేస్తూండటంతో… ఇక తెలంగాణలో సగం అద్దె బస్సులు.. మేఘా కృష్ణారెడ్డికేనా అన్న చర్చ ప్రారంభమయింది.
కన్స్ట్రక్షన్ కార్యకలాపాల్లో చురుకుగా ఉండే మేఘా కృష్ణారెడ్డి కొన్నాళ్ల కిందట… ఎలక్ట్రిక్ బస్సుల వ్యాపారంలోకి వచ్చారు. ఓ చైనా సంస్థను కొని.. బస్సుల ఉత్పత్తి ప్రారంభించారు. అయితే… దేశంలో టాటా, అశోక్ లేలాండ్,ఐషర్ లాంటి కంపెనీలతో పోల్చితే.. ఈ ఒలెక్ట్రా కంపెనీ.. చాలా చిన్నదే. కానీ… తెలంగాణలో బస్సులు నడిపే కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. దీనికి ప్రభుత్వ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యమే కారణమని ప్రచారం జరిగింది. మేఘా కృష్ణారెడ్డి.. తెలంగాణలో కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టుల్లో మెజార్టీ కాంట్రాక్టులు పనులు దక్కాయి. ఇతర ప్రాజెక్టులనూ చేస్తోంది. ఏపీలోనూ… ప్రస్తుత ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ తరుణంలో ఆయనకే ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్ట్ రాబోతోందన్న ప్రచారం జరుగుతోంది.
ఇప్పుడు.. తెలంగాణ కార్మిక వర్గాల్లో ప్రధానంగా జరుగుతున్న చర్చ… ఈ మేఘా బస్సులపైనే. ఆర్టీసీ ప్రైవేటీకరణ దిశగా… కేసీఆర్ వెళ్తున్నారని.. ఇందులో ప్రధానంగా మేఘా కంపెనీకే అవకాశాలు దక్కేలా చేయబోతున్నారని ఆరోపిస్తున్నారు. ఆర్టీసీలో ఇక సగం అద్దె బస్సులే ఉంటాయంటూ… కేసీఆర్ చేసిన ప్రకటనను… కార్మికులు గుర్తు చేసుకుంటున్నారు. అద్దె బస్సులతో ఇప్పటికే సంస్థను పాక్షికంగా ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేశారని.. దానిని అడ్డుకునేందుకు సమ్మె చేస్తూంటే.. మొత్తానికే ప్రైవేటీకరణ చేస్తున్నారని.. కార్మికులు అంటున్నారు. మొత్తానికి మేఘా మెరుపులు.. తెలంగాణ ఆర్టీసీలో.. మరిన్ని సంచలనాలకు కారణం అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్న చర్చ ప్రారంభమయింది.